అద్దంకి నియోజకవర్గం రావినూతల గ్రామంలోని ప్రముఖ సినీ నటుడు గిరిబాబు నివాసానికి వెళ్లిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.
గిరిబాబు మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి, ఆయనతో తనకున్న సన్నిహిత అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
అద్భుతమైన నటనా ప్రతిభతో తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా ప్రత్యేక గుర్తింపు పొందిన గిరిబాబు మరణం వ్యక్తిగతంగా తనకు తీరని లోటని పేర్కొన్నారు.
కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గిరిబాబు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

