ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన కనమర్లపూడి హరిప్రసాధ్…
మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు చేతుల మీదుగా నియామక పత్రం అందజేత…
2026-2028వ సంవత్సరాలకి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభలో ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షునిగా కనమర్లపూడి హరిప్రసాధ్ రావుని ఏకగ్రీవంగా నియమితులయ్యారు.
మంగళవారం మాజీ మంత్రివర్యులు సిద్ధా రాఘవరావు చేతుల మీదుగా ఆయన నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో, నూతన ప్రకాశం జిల్లా అధ్యక్షుడు కనమర్లపూడి హరిప్రసాధ్ మాట్లాడుతూ… తనపై నమ్మకం ఉంచి ఏకగ్రీవంగా ఎన్నుకున్న రాష్ట్ర నాయకత్వానికి, మాజీ మంత్రివర్యులు సిద్ధా రాఘవరావుకి,జిల్లా ఆర్యవైశ్య పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. అందరినీ కలుపుకొని ఆర్యవైశ్య సంఘ అభివృద్ధికి, సంఘ సభ్యుల సంక్షేమానికి తన వంతు సేవను అందిస్తానని పేర్కొన్నారు.

