గురువులపై దాడి
అనంతపురంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు నెట్టెంత వైరల్ అవుతున్నాయి
మా టీచర్లపై ద్వేషం ఎందుకు జగన్ అని లోకేష్ వ్యాఖ్యానించడం పట్ల తీవ్ర విమర్శలు సామాజిక మాధ్యమాలలో వెల్లువెత్తుతున్నాయి…
అసలు ప్రాథమికంగా స్పోర్ట్స్ కోటాలో వారికైనా డీఎస్సీ ద్వారా ఎంపిక అంటూ పరీక్షలు లేకుండానే ఉద్యోగాలు ఇవ్వటం ప్రాథమిక తప్పు కాదా…
టెట్ పాస్ కానీ వాళ్లకు టీచర్ ఉద్యోగాలు ఏ విధంగా ఇచ్చారు..
అదే కాదు స్పోర్ట్స్ సర్టిఫికెట్ల మంజూరులో పలు అక్రమాలు జరిగాయనేది వెలుగులోకి వచ్చాయి..
వీటన్నిటిమీద సమగ్ర దర్యాప్తు సిబిఐ వంటి సంస్థల ద్వారా జరపాలి అనేది వైసిపి డిమాండ్ అయినప్పుడు మరి ఎందుకు సిబిఐ విచారణకు ఆదేశించడం లేదు..
ఈరోజు అనంతపురంలో లోకేష్ మా టీచర్లు అని ప్రస్తావించడం ద్వారానే తన యువగళం టీం లోని తనవారికి ఇప్పించుకున్నామని చెప్పకనే చెప్పాడు అనేది స్పష్టంగానే అర్థం అవుతుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి..
జరిగిన తప్పులకు సమాధానం సూటిగా చెప్పకుండా నువ్వు చర్చకు సిద్ధమని మాజీ సీఎం జగన్ ను పిలవడం కడు హాస్యాస్పదంగా కనిపిస్తుంది…
అసలు 300 మంది టీచర్లు పాఠాలు చెప్పకుండా తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ప్లే కార్డులు పట్టుకొని ఇష్టానుసారం మాట్లాడడం కొత్త సాంప్రదాయానికి మార్గం చూపించడమే…
ఇక రెడ్‌బుక్ గురించి కూడా నారా లోకేష్ స్పష్టతనిచ్చాడు…
ఎవరిని వదిలి పెట్టేది లేదని స్పష్టం చేశాడు..
మద్యం కుంభకోణం కేసులో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ త్వరలోనే ఉంటుందా అనేది వేచి చూడాల్సిందే…

