Oplus_131072
ఢిల్లీ :గాదె సాయి కృష్ణ కేసులో ఏపీ ప్రభుత్వ తీరు పై సుప్రీం సీరియస్ అవడం శుభ పరిణామం..
మేం పాడిందే పాట ఆడిందే ఆట అన్న తీరున ఉన్న కూటమి ప్రభుత్వానికి ఈరోజు సుప్రీంకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు చాలా తీవ్రమైనవిగా ఇకనైనా గుర్తిస్తే మంచిది అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది…
నిలువునా ఒక మనిషి ప్రాణాన్ని పోలీస్ కస్టడీలో బలిగొని చివరికి మృతదేహాన్ని మాయం చేయడం అత్యంత అమానుషమని సమాజం మొరపెట్టుకున్న ఇప్పటికి గాదే సాయి కృష్ణ కేసు మసిబూసి మారేడు కాయ చేసి అసలు నిందితులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారనేది జగమెరిగిన సత్యం..
చివరికి అత్యున్నత న్యాయస్థానం ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ నిద్రపోతున్నాడా అని తీవ్రంగా వ్యాఖ్యానించడంతోపాటు తమ పరిధిలోనే కేసు విచారిస్తామని చెప్పడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి..
సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
గాదె సాయి కృష్ణ కేసు విచారణ సుప్రీం కోర్టు కు బదిలీ
కేసు విచారణ తాము చెప్పడతామన్న సుప్రీం
గాదె సాయి కృష్ణ తల్లి ఈ మెయిల్ ద్వారా ఫిర్యాదు చేస్తే ఎందుకు ఎఫ్ ఐ ఆర్ రిజిస్టర్ చేయలేదు?
డీజీపీ నిద్ర పోతున్నాడా?
సిసి టీవీ ఫుటేజ్ ధ్వంసం చేస్తే ఏ సి పి చూస్తూ కూర్చున్నారా?
మీ డ్యూటీ మీకు తెలియదా
మీ తీరు. ఘోరంగా ఉంది
ఇప్పటికి బాడీ లేదంటే. .దర్యాప్తు తీరు ఆందోళనకరంగా ఉంది.
సాయికృష్ణ మృతి కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- హైకోర్టు విచారణపై సుప్రీంకోర్టు స్టే..*
- సెప్టెంబర్ 30లోగా కేసు వివరాలు ఇవ్వాలని ఆదేశం
- సీల్డ్ కవర్ లో కేసు వివరాలు సమర్పించాలని ఆదేశం
- ప్రతివాదులందరికీ సుప్రీంకోర్టు నోటీసులు
- హైకోర్టులోని పిటిషన్లన్నీ బదిలీ చేయాలని ఆదేశం
- సాయికృష్ణ కేసుపై అక్టోబర్ 12న తదుపరి విచారణ
- కస్టడీలో సాయికృష్ణ మాయం కావడం చట్టవిరుద్ధమే: సుప్రీం

