తన ప్రియ సఖుడి మరణానికి సంతాప సూచికంగా మెగాస్టార్ చిరంజీవి సంతాప సందేశం…
ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత, నా ఆత్మీయ మిత్రుడు జీవీ నారాయణరావు గారు ఇక లేరనే వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
1976లో ‘అంతులేని కథ’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఆయన, ఎన్నో చిత్రాల్లోనూ, పలు టెలివిజన్ సీరియళ్లలోనూ తన విలక్షణమైన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.
నారాయణరావు గారితో నాకు ఎంతో సన్నిహితమైన అనుబంధం ఉంది. ‘దేవాంతకుడు’, ‘యముడికి మొగుడు’ వంటి చిత్రాలను నాతో నిర్మించిన నిర్మాతగా మా ప్రయాణంలో ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను…
ఓం శాంతి..

