2025 మెగా డీఎస్సీలో స్పోర్ట్స్ కోటాలో అనేక అవకతవకలు జరిగాయని డీఎస్సీ అభ్యర్థులు, వైసిపి నాయకత్వం గత కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే…
అయితే తాజాగా కర్నూలులో స్పోర్ట్స్ కోటా కింద టెట్ పాస్ కాకుండానే ప్రభాకర్ గౌడ్ కి ఎస్ జి టి పోస్ట్ అపాయింట్మెంట్ డీఎస్సీ లో జరిగిన అక్రమాల డొల్లతనాన్ని చెప్పకనే చెబుతుంది..
ఈ విషయం గత రెండు రోజుల నుండి సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది
డీఎస్సీ స్పోర్ట్స్ కోట నియామకాలపై ఆందోళనలకు వైసీపీ శ్రీకారం చుట్టడంతో అందుకు పోటీగా డీఎస్సీలో ఎంపికైన ఉపాధ్యాయులమంటూ మొదట కర్నూలు కొండారెడ్డి బురుజు సాక్షిగా ప్రభుత్వానికి మద్దతుగా ర్యాలీ నిర్వహించారు..
తర్వాత రాష్ట్రంలో కొన్ని చోట్ల కూడా డీఎస్సీ అనుకూల ర్యాలీలు జరిగాయి
ఇప్పుడు ఎక్కడైతే అనుకూల నినాదాలు చేస్తూ భారీ ప్రదర్శన చేశారో ఆ జిల్లాలోనే డీఎస్సీ అక్రమాల భాగోతం బయటపడటం విశేషం..
తాము ఏమి చేసిన అదే కరెక్ట్ అంటూ ముందుకు సాగటం ఎంత మాత్రం మంచిది కాదు ఏ పార్టీకైనా.. ప్రజలు అన్ని విషయాలను గమనిస్తుంటార
ఇకనైనా సిబిఐ సమగ్ర విచారణకు తమ తప్పు ఏమీ లేకపోతే ఆదేశించాలని వైసీపీ వాళ్లు తెలుగుదేశం పార్టీకి ఛాలెంజ్ చేస్తున్నారు..
నెట్టింట కూడా కొండారెడ్డి బురుజు సాక్షిగా డీఎస్సీ అక్రమ బయటపడింది కదా మరి ఇప్పుడు ఏమంటావ్ విద్యాశాఖ మంత్రి లోకేష్ అని విమర్శిస్తున్నారు…

