Oplus_131072
కర్నూలు జిల్లాలో స్పోర్ట్స్ కోటాలో సుధాకర్ అనే వ్యక్తి అక్రమంగా ఎస్ జి టి పోస్ట్ పొందాడనేది అధికారుల విచారణలో తేలింది..
ఇప్పటికే డీఎస్సీలో స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగాయంటూ వైయస్సార్సీపి డీఎస్సీ అభ్యర్థులు పలుమార్లు ఆందోళనలు చేశారు..
అయితే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అభ్యర్థులు ప్రతిపక్షం అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానం లేకుండా మాజీ సీఎం వైఎస్ జగన్ తో డిఎస్సి విషయమై బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు..
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తమ ప్రభుత్వం డీఎస్సీ ని పారదర్శకంగా నిర్వహించి ఉద్యోగాలు అభ్యర్థులకు 180 రోజుల వ్యాధిలో అందించామని కావాలనే పనిగట్టుకొని గొడ్డలి పార్టీ రాద్ధాంతం చేస్తుంది అని విమర్శించారు..
అయితే తాజాగా కర్నూలు జిల్లా వల్లూరులో మండల ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఎస్జీటీ సుధాకర్ టెట్ పాస్ కాకుండా ఉద్యోగం అతనికి ఎలా ఇచ్చారని ఆరోపణలు రావడంతో కొన్ని టీవీ ఛానల్ లలో విస్తృతంగా ప్రచారం కావడంతో డిఈఓ సుధాకర్ విచారణ చేపట్టారు..
ఈ విచారణలో ఆయన టెట్లో ఉత్తీర్ణత సాధించలేదని తేలిందని స్పష్టం చేశారు
దీనిపై శాఖాపరమైన చర్యలకు ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు వివరించారు..
సుధాకర్ వివాదం ఒక్కటే కాదు ఇలాంటి అనేక అక్రమాలు స్పోర్ట్స్ కోటలో జరిగాయి వెంటనే సిబిఐ విచారణకు అప్పగించాలని వైసీపీ శ్రేణులు డీఎస్సీ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు…


