అద్దంకి నియోజకవర్గానికి మరో రెండు బీటీ రోడ్లు..
డీఎంఎఫ్ గ్రాంట్ నుంచి రూ.2.65 కోట్లు మంజూరు…
అద్దంకి నియోజకవర్గంలో రహదారి సౌకర్యాల అభివృద్ధికి విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చొరవతో డీఎంఎఫ్ గ్రాంట్ నుంచి రెండు బీటీ రోడ్ల నిర్మాణానికి మొత్తం రూ.2.65 కోట్లు మంజూరయ్యాయి…
సంతమాగులూరు మండలంలో అడవిపాలెం నుంచి ఏల్చూరు వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.1.90 కోట్లు మంజూరయ్యాయి…
జె.పంగులూరు మండలంలో రామకూరు నుంచి వల పర్ల వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.75 లక్షలు మంజూరయ్యాయి…
ఈ రెండు రహదారుల నిర్మాణంతో ఆయా గ్రామాల ప్రజలకు రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి…
గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తూ, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించే దిశగా చర్యలు చేపడుతోంది…

