వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ నియామకాలపై రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది..
ఈనెల 13వ తారీకు ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ నియామకాల ఎంపిక జరిపేందుకు జీవో జారీ చేసింది…
మరలా మరసటి రోజు 14వ తారీఖున ఏపీపీఎస్సీ నుండి నియామకాల ఎంపిక తప్పించి వెటర్నరీ నిపుణుల కమిటీ ఆధ్వర్యంలో ఎంపిక నిర్వహించనున్నట్లు మరల కొత్త జీవో జారీ చేసింది…
స్వయానా మంత్రి అచ్చం నాయుడు ఈ ఒక్కసారికి ఈ విధంగా ఎంపిక జరుగుతుందని ప్రకటించారు..
అయితే దీనిపై వైసీపీ అనుకూల మీడియా సాక్షి దినపత్రిక, టీవీలలో ఈ అంశాన్ని ఎండ గడుతూ కథనాలు వెలువడ్డాయి..
వైసీపీతోపాటు పలు వర్గాల నుండి ఈ విధానంపై విమర్శలు వెల్లువెత్తడంతో మరల ఈరోజు ఏపీపీఎస్ ఆధ్వర్యంలోనే నియామకాల ప్రక్రియ జరుగుతుంది అని మరల జీవో జారీ చేసింది..
ఇప్పటికే డీఎస్సీ టీచర్ల నియామకాల్లో ప్రత్యేకంగా స్పోర్ట్స్ కోట తదితర అక్రమాలపై నిండా మునిగి మరల ఇంకో దుస్సాహసానికి ప్రయత్నించి తీవ్రమైన విమర్శలు రావడంతో కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గక తప్పలేదు…

