Oplus_131072
ఇటీవల విజయవాడలో శాప్ కార్యాలయం ముందు వైసీపీ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో పాల్గొన్న వైసీపీ కార్యకర్తలపై అక్రమ సెక్షన్ల కింద కూటమి ప్రభుత్వం కేసులు పెట్టింది..
30 మంది పై కేసు పెట్టి కోర్టులో హాజరు పరచగా 28 మందికి బెయిల్ మంజూరు చేసింది విజయవాడ న్యాయ స్థానం…
ఈ కేసు వాదించిన ఒగ్గు గవాస్కర్ అనే న్యాయవాదిపై అక్కసుతో రౌడీ షీట్ ప్రభుత్వం ఓపెన్ చేసింది..
ఈ విషయమై శాంతియుతంగా నిరసన తెలుపుతూ విజయవాడలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బార్ అసోసియేషన్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు లాయర్లు ర్యాలీ చేస్తున్న సమయంలో పోలీసులు అడ్డుకోనడంతో లాయర్లకు పోలీసులకు మధ్య తోపులా జరిగింది..
స్వయంగా బారు అసోసియేషన్ అధ్యక్షుడిపై, మహిళా న్యాయవాదిపై లాఠీచార్జి చేశారని న్యాయవాదులు ఆరోపిస్తున్నారు..
అంతేకాకుండా శాంతి యుతంగా తమ నిరసన తెలుపుతూ ఉంటే అడ్డుకోవడమేంటని ప్రశ్నిస్తున్నారు..
త్వరలోనే కోర్టు ద్వారా ఇందుకు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు

