ప్రముఖ వెటరన్ సినీనటి షావుకారు జానకి మానవత్వం దాతృత్వమే కాదు స్వదేశాభిమానం కూడా మెండుగా కలిగిన ధీర నారి..
బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి సినిమాలలో మహిళలు నటించడం పట్ల సదభిప్రాయం ఉండని ఆ రోజుల్లో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దాదాపు 372 సినిమాల్లో తెలుగు, తమిళంలో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న షావుకారి జానకమ్మ తన అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టినట్లు స్పష్టంగా చెబుతారు..
ఆ రోజుల్లో పారితోషికం అందుకున్న వెంటనే ఆ షూటింగ్ యూనిట్లో ఉన్న స్టాఫ్ కి ఆ పారితోషికంలో కొంత భాగం ఇస్తూ ఉండేది..
అలా ఇవ్వడం మానసిక సంతృప్తికి సంబంధించిన అంశం దానిని టిప్ అంటే ఒప్పుకోను అని చెప్పేవారు జానకమ్మ…
అదేవిధంగా తన ఇంట్లో పనిచేసే వ్యక్తులను కుటుంబ సభ్యులుగా చూసేది కానీ యజమాని సేవకులు అనే భావన ఆమెకు ఉండేది కాదు..
ఆమెకు కుటుంబ సభ్యులతో అమెరికాలో ఉండే విధంగా గ్రీన్ కార్డ్ ఉన్నప్పటికీ అవి వదలుకొని మాతృదేశాభిమానంతో తనకు గుర్తింపు ఇచ్చిన గడ్డ మీదే తుది వరకు జీవనం సాగించాలని ఆమె చెన్నైలోనే ఉంటూ వచ్చారు..
మరో అలనాటి ప్రముఖ నటి కృష్ణకుమారి కూడా ఆమె సొంత చెల్లెలే… ఏడేళ్ల క్రితం తన చెల్లెలు మరణాంతరం కొంత లోటు తనకు ఏర్పడిందని… అదేవిధంగా కుటుంబ సమస్యలు అనేకం మనిషి జీవన విధానంలో ఎదురవుతూ ఉంటాయని వాటిని అధిగమిస్తూ చిరునవ్వుతో బతకడమే తనకు ఇష్టమని ఆమె తన మనోగతాన్ని పలు ఇంటర్వ్యూలలో ఆవిష్కరించారు..
ఆ కళామతల్లికి నివాళులర్పిద్దాం…


