వెలుగొండ నిర్వాసితులకు కలెక్టర్ భరోసా..
మార్కాపురం: ప్రస్తుత జాబితాలో పేర్లు రాలేదని వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత భరోసా ఇచ్చారు..
మిగిలిన జాబితాపై జిల్లా స్థాయి అధికారులతో ప్రత్యేకంగా విచారణ చేయిస్తామని ఆమె తెలిపారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ నిబంధనల మేరకు పూర్తి స్థాయిలో పరిహారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కలెక్టర్ స్పష్టం చేశారు.

నిర్వాసితుల సమస్యలను పరిశీలించి అర్హులైన వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు.
