వైయస్సార్సీపి మునిసిపాలిటీ నామినేషన్ల పర్వంలో జరిగిన అవకతవకలపై వేసిన పిటిషన్ కు సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించి సంచలన ఆదేశాలు జారీ చేసింది…
హింస జరిగిన 19 మునిసిపాలిటీలలో ఆంధ్రప్రదేశ్లో నామినేషన్ల గడువును పొడిగించాలని ఆదేశాలు జారీ చేసింది…
నామినేషన్లు వేసే వైఎస్ఆర్సిపి అభ్యర్థులకు భద్రత కల్పించాలని ఆదేశించింది..
ఈనెల 23వ తేదీ వరకు అభ్యర్థుల తుది జాబితాను ఆ 19 మునిసిపాలిటీలలో ప్రకటించవద్దని స్పష్టం చేసింది…
స్వయంగా జిల్లా కలెక్టర్లు ఆ మున్సిపాలిటీలలో నామినేషన్లను స్వీకరించాలని ఆదేశించింది..
ఈరోజే రాష్ట్ర ఎన్నికల కమిషన్ నామినేషన్ల గడువు పొడిగిస్తూ ఆయా మున్సిపాలిటీలో నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది…
అసలు ఆంధ్రప్రదేశ్లో నామినేషన్లపై ఎలాంటి ఫిర్యాదులు రాలేదని పోలీసులు చెప్పడం ఆ రాష్ట్రంలో ఉన్న తీవ్రమైన పరిస్థితిని సూచిస్తుందని సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది

