Oplus_131072
అత్యంత దారుణంగా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల పరిస్థితులు నెలకొన్నాయి..
ఒకవైపు సుప్రీం కోర్ట్ మునిసిపాలిటీ నామినేషన్ల విషయంలో కీలక ఆదేశాలు ఇచ్చినా అవి చెవిటి వారి ముందు శంఖం ఊదినట్లుగానే తయారయ్యాయి…
జడ్పిటిసి ఎంపిటిసి నామినేషన్ల పర్వం కూడా అత్యంత దారుణంగా నెలకొని ఉంది…
ఎక్కడికక్కడ టీడీపీ శ్రేణులు, వైసీపీ క్యాడర్ను అడ్డుకోవడం నామినేషన్ పత్రాలు చించి వేయడం జరుగుతున్న ఎలక్షన్ కమిషన్ పోలీస్ వ్యవస్థ కల్లప్పగించి చూస్తోంది..
ఇలా నామినేషన్ పత్రాలు లాక్కుని వెళ్ళిపోతుంటే రిటర్నింగ్ అధికారులు ఫిర్యాదులు ఎందుకు చెయ్యడం లేదు??
మార్కాపురం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం గిద్దలూరు మండలం వేములపాడు ఎంపీటీసీ స్థానానికి నామినేషన్ వేస్తుండగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి చేతుల నుంచి నామినేషన్ ఫారాలు తీసుకుని వాటిని టీడీపీ నాయకుడు చించి వేసాడు..
కేవలం పోలింగ్ అధికారి పోలీసులు చోద్యం చూస్తున్నారు…మరి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు ఇదేనా ప్రజాస్వామ్యం ఇదేనా ఎన్నికలు నిర్వహించే తీరు అని జాతీయస్థాయిలో ట్విట్టర్లో సామాజిక మాధ్యమాల్లో పలువురు ప్రముఖులు ప్రశ్నిస్తున్న ప్రయోజనం శూన్యం

