గంజాయి తరలిస్తున్న కేటుగాళ్లను పట్టుకోవాల్సింది పోలీస్
కానీ కుడి ఎడమైతే పొరపాటు లేదు అన్న
చందాన గంజాయి తరలిస్తున్న ఏపీ పోలీస్ లను ప్రజలు పట్టుకున్నారు..
అద్దంకి సమీపంలో బల్లికురవ ఎస్సై నాగరాజు, సంతమాగుళూరు ఎస్సై నాగమల్లేశ్వరావు ప్రయాణిస్తున్న కారు ఆటోకి ఢీకొట్టి యాక్సిడెంట్ కి గురవ్వగా..కారు డిక్కీలో గంజాయి, మద్యం బాటిల్స్ తో వారు ఇరువురు సివిల్ డ్రెస్ లో దొరికిపోయారు..
విషయం తెలుసుకొని అక్కడకు వచ్చిన సిఐ సుబ్బరాజు కారు డిక్కీ ఓపెన్ చేయకుండా అడ్డగించే ప్రయత్నం చేశారు..
అయితే ఎట్టకేలకు ఓపెన్ చేయగా మద్యం బాటిల్స్ గంజాయి దొరికినట్లు సమాచారం..
వెంటనే ధర్మవరం ప్రెసిడెంట్ చాగంటి రాజేంద్ర( టీడీపీ నాయకుడు) కారులో ఇద్దరు ఎస్సైలను అక్కడ నుండి పంపి వేశారు.
ఒక్కొక్కరికి ఒక్కో న్యాయమా? అంటూ సీఐ తీరుపై స్థానికులు మండిపడుతున్నారు.
అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో గంజాయిని నిర్ములించడం అంటే ఇదేనా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి..
ఇప్పటివరకు విజయవాడ లో గాదె సాయి కృష్ణ డెడ్ బాడీ దొరకని పరిస్థితి… విచారణ పేరుతో సాగదీసి చివరకు కేసును నిర్వీర్యం చేసే ప్రయత్నం…
పది రోజుల క్రితం మద్యం మత్తులో బడా బాబులు చేసిన దారుణాత దారుణమైన యాక్సిడెంట్లో మృతి చెందిన రాజమండ్రి మెడికో ప్రియాంక కేసు కేసు కూడా నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతుందని విమర్శిస్తున్నారు…
ఇప్పుడు స్వయంగా ఇద్దరు ఎస్ఐలు బాధ్యతారహితంగా యాక్సిడెంట్ చేయడంతో పాటు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడటం పట్ల అది కప్పిపుచ్చేందుకు పోలీస్ అధికారులు చేస్తున్న ప్రయత్నం తీవ్ర విమర్శలకు దారి తీస్తుంది..
యధా రాజా తధా ప్రజా అన్నట్లు రెడ్ బుక్ రాజ్యాంగంలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయి పెడత్రోవ పడుతుంది అనేందుకు ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి అని పలువురు ప్రశ్నిస్తున్నారు..

