అసెంబ్లీ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి లోకేష్ డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాల పై తన వైఖరిని స్పష్టం చేశారు..
క్రీడాకారులకు ప్రోత్సాహం ఇవ్వడం అనేది తెలుగుదేశం ప్రజా ప్రభుత్వం లక్ష్యమని,అందులో భాగంగానే పరీక్షలు లేకుండా స్పోర్ట్స్ కోటా నియామకాలు చేపట్టడంలో తప్పేమిటని సమర్థించుకునే ప్రయత్నం చేశారు..
ప్రముఖ క్రీడాకారులు పీవీ సింధు.. ఎర్ర జ్యోతి వంటి వారితో డీఎస్సీ నియామకాలను పోల్చారు..
దేశానికి వన్నెతెచ్చిన క్రీడాకారులకు నేరుగా ఉద్యోగాలు ఇవ్వగా వీరికి ఇవ్వడంలో తప్పేంటని అన్నారు..
అదేవిధంగా శాసనమండలిలో డీఎస్సీ పై వాడి వేడి చర్చ సందర్భంగా మంత్రి అచ్చం నాయుడు చిన్న తప్పు పట్టుకొని ఇంత గొడవ చేస్తారా?
అసలు మీకు ఆ హక్కు ఎక్కడ ఉంది వైసీపీ గవర్నమెంట్లో డీఎస్సీ నియామకం ఒకటైన చేశారా అని ఎదురుదాడి చేయడంతో పాటు.. సీనియర్ నేత బొత్సపై నోరు జారారు..
మొత్తానికి వైసిపి డీఎస్సీపై చేసిన దీక్షలు పోరాటాలు ప్రదర్శనలతో తెలుగుదేశం ప్రభుత్వం ఇరకాటంలో పడటంతో పాటు డొంక తిరుగుడుగా సమాధానం చెబుతూ సమర్ధించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది..
ఇప్పటివరకు వైసీపీ ప్రభుత్వం ముఖ్యంగా స్పోర్ట్స్ కోట అంశాన్ని హైలెట్ చేస్తూ పోస్టు 15 లక్షల రూపాయల చొప్పున అమ్ముకున్నారని తీవ్ర విమర్శలు చేసింది..
నారా లోకేష్ రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేసింది మరి ఇది ఇంకా ఎన్ని మలుపులు తిరగడంతో వేచి చూడాల్సిందే

