ఇటీవల అద్దంకి సమీపంలో శంఖవరప్పాడు గ్రామంలో బల్లికురవ, సంతమాగులూరు ఎస్సైలు ప్రయాణిస్తున్న ప్రైవేట్ వాహనం యాక్సిడెంట్ చేయడంతో పాటు సదరు వాహనంల్లో గంజాయి, మందు బాటిళ్లు గ్రామస్తులు బహిరంగంగా బయటపెట్టిన సంఘటన రాష్ట్ర, దేశవ్యాప్తంగా సంచలనమే సృష్టించింది…
ఈ నేపథ్యంలో గుంటూరు రేంజ్ ఐజి త్రిపాఠి సంఘటన స్థలాన్ని సందర్శించి జిల్లా ఎస్పీ ఇచ్చిన నివేదిక ఆధారంగా సంతమాగులూరు ఎస్సై నాగమల్లేశ్వరరావు వి ఆర్ కి పంపుతూ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం అదే విధంగా బల్లికురవ ఎస్సై నాగరాజు కి,సీఐకి చార్జి మెమొలు, డిఎస్పికి షో కాస్ నోటీస్ జారీ దారి చేసినట్లు తెలిసింది.. అయితే ఇది కేవలం కంటి తుడుపు చర్యగా కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు…


