Oplus_131072
గాజువాకలో రవాణా శాఖ అధికారి డ్రైవర్ దురహంకారం… లారీ డ్రైవర్ పై దాడి..
రక్తం వచ్చేటట్టు లారీ డ్రైవర్‌పై పిడుగుద్దులతో దాడి చేసిన రవాణా శాఖ ఇన్స్పెక్టర్ పార్వతి డ్రైవర్
షీలానగర్ మారుతి జంక్షన్ వద్ద లారీ డ్రైవర్ వాహనం ఆపలేదని లారీని ఓవర్ టేక్ చేసి సదరు లారీని ఆపిన ఇన్స్పెక్టర్ పార్వతి…
ఇన్స్పెక్టర్ పార్వతి సమక్షంలో ఆమె డ్రైవర్ వీరంగం చేస్తూ లారీ డ్రైవర్‌పై పిడుగుద్దులతో దాడి చేసాడు..
పిడుగుద్దులతో రవాణా శాఖ అధికారి డ్రైవర్ లారీ డ్రైవర్ పై విచక్షణ రహితంగా దాడి చేస్తుంటే రవాణా శాఖ ఇన్స్పెక్టర్ పార్వతి చోద్యం చూస్తూ నిలబడ్డారు..
విచక్షణ రహితంగా దాడి చేయడంపై ఆంధ్రప్రదేశ్ లారీ అసోసియేషన్ సభ్యులు, ఆ ప్రాంత వాసులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు…
ఆర్టీవో అధికారిపై డ్రైవర్ పై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని వాళ్లు డిమాండ్ చేశారు…

