అమరావతి: ఏపీలో 10,060 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది..
2026 జాబ్ క్యాలెండర్లో నాలుగు దశల్లో 10,060 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నిర్ణయించింది..
తొలి దశలో 1,523 పోస్టులు ఇప్పటికే నోటిఫై చేసింది..
సెప్టెంబర్ 15న రెండో దశలో 3,231 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వనుంది..
రెండో దశలో గ్రూప్-1లో 149 పోస్టులు, పోలీస్ విభాగంలో భారీగా ఉద్యోగాలు, రెండో దశలో పోలీస్ కానిస్టేబుల్ 542, సివిల్ ఎస్ఐ 182 పోస్టులు భర్తీ కానున్నాయి..
అక్టోబర్ 15న మూడో దశలో 2,311 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయనుంది…
మూడో దశలో గ్రూప్-2లో 673 పోస్టులు,డిప్యూటీ తహశీల్దార్ 200 పోస్టులు, ఇంజినీరింగ్ సహా ఇతర విభాగాల్లో 1,638 పోస్టులు భర్తీ చేయనుంది..


అక్టోబర్ 15న నాలుగో దశలో 2,995 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వనుంది..
ఈ దశలో టీచర్ల పోస్టులు భర్తీ చేయనుంది…
