అమరావతి :
వెలిగొండ ప్రాజెక్టు కోసం భూములు, ఇళ్లు కోల్పోయి త్యాగాలు చేసిన నిర్వాసిత కుటుంబాలకు
ప్రభుత్వం మరో రూ.250 కోట్ల పరిహారాన్ని అందించింది.
ఉండవల్లి నివాసంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్వాసిత కుటుంబాలకు రూ.250 కోట్ల చెక్కును అందజేశారు.
ఇప్పటివరకు వెలిగొండ నిర్వాసితులకు ప్రభుత్వం మొత్తం రూ.768 కోట్ల పరిహారం అందించింది.
ఈ కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు , ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి , ఎమ్మెల్యేలు కందుల నారాయణ రెడ్డి ,ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి , ముత్తుమల అశోక్ రెడ్డి , ఎర్రగొండపాలెం టిడిపి ఇన్చార్జ్ గూడూరి ఏరిక్షన్ బాబు పాల్గొన్నారు…


