శాసనమండలిలో ఫైర్ బ్రాండ్ గా వైసీపీ తరఫున వాడి వేడి వాదనలు వినిపిస్తున్న శాసనమండలి సభ్యుడు తూమాటి మాధవరావు డిప్యూటీ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు.
డిప్యూటీ చైర్మన్ పదవికి మాధవరావు నామినేషన్ ఒక్కటే కావడంతో ఆయన ఎంపిక లాంచనప్రాయమే..
నేడు ఆ మేరకు శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు అధికారిక ప్రకటన చేయనున్నారు..
మాధవరావు ప్రకాశం జిల్లా కందుకూరు వాస్తవ్యులు..
శాసనమండలి చర్చల్లో తన పదునైన ప్రశ్నలతో వాదనలతో మంచి గుర్తింపు పొందారు..
సామాజిక సమీకరణాల నేపథ్యంలో మాధవరావును అభ్యర్థిగా వైసిపి బరిలోకి దింపగా ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ నుండి కూటమి పార్టీల నుండి ఎటువంటి నామినేషన్ దాఖలు కాలేదు ప్రస్తుతం శాసనమండలిలో వైసిపి సభ్యులు అధికంగా ఉండటంతో అధికార కూటమి కూడా తమ తరఫున అభ్యర్థిని నిలబెట్టే ప్రయత్నం చేయలేదు.
సహజంగా ఆయా సభలలో మెజార్టీ లేకపోయినా పోటీకి నిలబెట్టే ఆలోచన గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసేవారు..
అయితే అందుకు విరుద్ధంగా ఈసారి పోటీకి ఎవరిని నిలబెట్టకపోవడం విశేషం


