అద్దంకి ప్రసన్నాంజనేయ స్వామికి విరాళాల వెల్లువ
అద్దంకి ప్రసన్నాంజనేయ స్వామికి విరాళాల వెల్లువ
అద్దంకి :- ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సింగరకొండ క్షేత్రంలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానంలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి రాతి మండపం నిర్మాణానికి గుంటూరు పట్టణానికి చెందిన కామేపల్లి లక్ష్మీ ప్రసాద్ - సామ్రాజ్యం దంపతులు శనివారం దేవస్థాన పరిపాలన కార్యాలయంలో ఆలయ కార్యనిర్వహణాధికారి మదమంచి తిమ్మనాయుడు ను కలసి 2,01,116/- చెక్కును విరాళం గా అందజేశారు....
దేవస్థానంలో ప్రాంగణంలోని మారుతీ భవన్ రూముల అభివృద్ధి ఆధునీకరణ పనులకు కొరిశపాడు మండలం రావినూతల గ్రామానికి చెందిన పుట్టా భాస్కర్ రావు - లక్ష్మీ,కుమారుడు నాగ చందు,కుమార్తె జాహ్నవి లు ఆలయ ప్రాంగణంలో ఆలయ ఈ ఓ యం తిమ్మనాయుడు ను శనివారం కలిసి 1,25,000/- నగదును విరాళం గా అందజేశారు...
ఆలయ ఈ ఓ యం తిమ్మనాయుడు భాస్కర్ రావు దంపతులను సత్కరించి స్వామి వారి ప్రసాదాలను అంద జేశారు... రాతి మండపం నిర్మాణానికి మండలం లోని నాగులపాడు గ్రామానికి చెందిన పట్టణంలోని శ్రీనగర్ లో నివాసముంటున్న అడుసుమిల్లి వెంకటేశ్వర్లు దంపతులు శనివారం దేవస్థాన పరిపాలన కార్యాలయంలో ఆలయ కార్యనిర్వహణాధికారి మదమంచి తిమ్మనాయుడు ను కలసి 1,00,359 /- చెక్కును విరాళం గా అందజేశారు...
రాతి మండపం నిర్మాణానికి పట్టణంలోని మోడరన్ సూపర్ మార్కెట్,యం ఆర్ ఎఫ్ టైర్స్ షో రూమ్ ల అధినేత చిన్ని అంజిబాబు - శ్రీదేవి కుటుంబ సభ్యులు శనివారం దేవస్థాన పరిపాలన కార్యాలయంలో ఆలయ కార్యనిర్వహణాధికారి మదమంచి తిమ్మనాయుడు ను కలసి 1,01,116 /- చెక్కును విరాళం గా అంద జేశారు...
రాతి మండపం నిర్మాణానికి మండలంలోని తిమ్మాయ పాలెం గ్రామానికి చెందిన పట్టణంలోని శశ్విత గ్రాఫిక్స్ అధినేత అల్లంనేని పూర్ణ చంద్రరావు - పద్మజ కుటుంబ సభ్యులు శనివారం దేవస్థాన పరిపాలన కార్యాలయంలో ఆలయ కార్యనిర్వహణాధికారి మదమంచి తిమ్మనాయుడు ను కలసి 1,05,116 /- చెక్కును విరాళం గా అంద జేశారు..
రాతి మండపం నిర్మాణానికి పట్టణానికి చెందిన వేముల వాల్లేశ్వర రావు ధర్మపత్ని శ్రీదేవి కుటుంబ సభ్యులు శనివారం దేవస్థాన పరిపాలన కార్యాలయంలో ఆలయ కార్యనిర్వహణాధికారి మదమంచి తిమ్మనాయుడు ను కలసి స్వామి వారి రాతి ముఖ మండపం నిర్మాణానికి 1,01,116 /- చెక్కును విరాళం గా అంద జేశారు.
ఈ సందర్భంగా దాతలకు
ఆలయ ఈ ఓ యం తిమ్మనాయుడు దాతలు వేముల వాల్లేశ్వర రావు , కోనేటి కళ్యాణ్ ను సత్కరించి స్వామి వారి ప్రసాదాలను అందజేశారు....
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024
Comments 0