వేటపాలెంలో యదేచ్చగా సాగుతున్న ఇసుక అక్రమ రవాణా మహిళా తహసిల్దార్ కు బెదిరింపులు
వేటపాలెంలో యదేచ్చగా సాగుతున్న ఇసుక అక్రమ రవాణా మహిళా తహసిల్దార్ కు బెదిరింపులు
వేటపాలెం: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉచిత ఇసుక మాటున అక్రమ రవాణా అడ్డు అదుపు లేకుండా విచ్చల విడిగా కొనసాగుతోంది. శనివారం ఉదయం రెవిన్యూ, పోలీస్, మైనింగ్ అధికారులు మెరుపు దాడి చేయటంతో ఇసుక అక్రమ తవ్వకాలు జరుపుతున్న అక్రమార్కులు జెసిబి ని వదిలి పారిపోయారు. వేటపాలెం రైల్వే బ్రిడ్జి పక్కన రైల్వే ట్రాక్ వెంబడి అసైన్డ్ భూముల్లో ఇసుక అక్రమ త్రవ్వకాలు జరుపుతున్న విషయమై సెప్టెంబర్ లో రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈమెయిల్ ద్వారా ఫిర్యాదులు అందిన నేపథ్యంలో మైనింగ్, పోలీస్, రెవెన్యూ అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించి ఇసుక తవ్వకాలకు సంబంధించి అంచనాలు వేయడం జరిగింది.
అయితే అప్పట్లో ఇసుకాసురులపై క్రిమినల్ చర్యలు చేపట్టని కారణంగా ఇప్పటికీ అక్రమ మైనింగ్ కొనసాగుతోంది. శనివారం ఉదయం విశ్వసనీయ సమాచారం అందుకున్న వేటపాలెం తహశీల్దార్ పార్వతి తన సిబ్బందితో అక్రమ మైనింగ్ మీద ఆకస్మిక దాడి చేసి జెసిబిని స్వాధీనం చేసుకోవడం సంచలనంగా మారింది.
ఒకవైపు రెవిన్యూ మరోవైపు పోలీస్, మైనింగ్ అధికారులు వరుసగా సంఘటన స్థలానికి రావడంతో అక్రమ రవాణా దారులు జెసిబి ని తరలించే ప్రయత్నం చేశారు. తహశీల్దార్ పార్వతి తన సిబ్బందితో పాటు పోలీసు సహకారంతో అక్రమ ఇసుక తవ్వకాలు జరుపుతున్న జెసిబిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. గతంలో విచారణ జరుగుతుంది అందిన ఫిర్యాదులపై విచారణ జరుగుతున్న రెవెన్యూ, పోలీస్, మైనింగ్ అధికారుల అలసత్వం కారణంగా, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉచిత ఇసుక ముసుగులో ఇసకాసురులు గత పది రోజులుగా పెచ్చరిల్లిపోతున్నారు. ప్రభుత్వ భూముల్లో అడ్డగోలుగా ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నప్పటికీ, సదరు భూముల్లో తాత్కాలిక పట్టాలు పొందిన వ్యక్తులను, వారి ద్వారా ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్న వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు కేసులు నమోదు చేసి కఠినంగా వ్యవహరించకపోవడం వల్ల, అడ్డగోలుగా ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందిన వెంటనే వేటపాలెం తహసీల్దార్ పార్వతి రెవిన్యూ సిబ్బందితో, వేటపాలెం ఎస్సై వెంకటేశ్వర్లు పోలీస్ సిబ్బందితో సంఘటన స్థలానికి సకాలంలో వెళ్లి జెసిబి స్వాధీనం చేసుకోవడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
తహశీల్దార్ కు బెదిరింపులు: మండలంలో పలుచోట్ల ఇసుక అక్రమ రవాణా జరుగుతుంటే మా మీదే దాడి చేస్తారా అంటూ ఆవుల అశోక్ అనే వ్యక్తి వేటపాలెం తహసిల్దార్ ను బెదిరిస్తూ, ఏం చేస్తారో చేయండి చూద్దాం అంటూ, మహిళా తహసిల్దార్ తో వాగ్వివాదం చేయడం మండలంలో ఇసుక మాఫియా బరితెగింపు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా రెవెన్యూ, పోలీస్, మైనింగ్ అధికారులు సంయుక్తంగా కార్యాచరణను రూపొందించి ఇసుక మాఫియా పై కఠినంగా వ్యవహరించకపోతే భూగర్భ జలాలు అడుగంటి పోవడమే కాకుండా, రైల్వే ట్రాక్ పరిసరాల్లో అక్రమ తవ్వకాల వలన భవిష్యత్తులో పెను ప్రమాదాలు సంభవించే అవకాశం ఉన్నందున జిల్లా యంత్రాంగం చీరాల నియోజకవర్గంలో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాను ఉక్కు పాదంతో అణిచివేయాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024
Comments 0