పమిడిపాడు లో పలు అభివృద్ధి పనులు.ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి, పార్థసారథి... మేదరమెట్ల రావినూతల పమిడిపాడు ల మధ్య డబల్ లైన్ రోడ్డు విస్తరణ త్వరలోనే
పమిడిపాడు లో పలు అభివృద్ధి పనులు.ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి, పార్థసారథి... మేదరమెట్ల రావినూతల పమిడిపాడు ల మధ్య డబల్ లైన్ రోడ్డు విస్తరణ త్వరలోనే
పమిడిపాడులో అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రులు గొట్టిపాటి రవి, కొలుసు పార్థసారథి
అద్దంకి, ఆగస్టు 26:
సీఎం చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంగా ముందుకు వెళ్తోందని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని పేర్కొన్నారు. రికార్డు స్థాయిలో రాష్ట్రవ్యాప్తంగా పింఛన్లు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా 1.10 లక్షల మందికి స్పౌజ్ పింఛన్లు ఇటీవల మంజూరు చేశామని వివరించారు. “తల్లికి వందనం” పథకంలో భాగంగా తల్లుల ఖాతాల్లో రూ.10 వేలు జమ చేశామని గుర్తు చేశారు. మంగళవారం నాడు గృహనిర్మాణ, ఐ అండ్ పీఆర్ శాఖ మంత్రి కొలుసు పార్థసారథితో కలిసి కొరిశపాడు మండలం పమిడిపాడు గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. పమిడిపాడు గ్రామంలో రూ.70 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు, సైడు డ్రైన్లు, రూ.34.68 లక్షలతో చేపట్టిన ఇంటింటికీ తాగునీటి పథకం, దాతల సహకారంతో నిర్మించిన బస్ షెల్టర్ ను మంత్రులు మంత్రులు గొట్టిపాటి రవి, కొలుసు పార్థసారథి ప్రారంభించారు. అదనంగా, రూ.30 లక్షల సీఎస్ఆర్ నిధులతో నిర్మించనున్న సామాజిక భవనానికి శంఖుస్థాపన చేశారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి, ప్రజల హర్షధ్వానాల మధ్య శిలాఫలకాలు ఆవిష్కరించారు.
ఈ క్రమంలో మాట్లాడిన మంత్రి గొట్టిపాటి రవి కుమార్... కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్న క్యాంటీన్లను పునరుద్ధరించిందని పేర్కొన్నారు. మేదరమెట్ల నుంచి పమిడిపాడుకు రెండు లైన్ల రోడ్లను త్వరలో మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకుని వెళ్లినట్లు తెలిపారు. పమిడిపాడుతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు. తాను తొలిసారి రాజకీయ వేదిక ఎక్కింది పమిడిపాడులోనే అని గుర్తు చేశారు. ఈ గ్రామ ప్రజలు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెలుగుదేశం పార్టీకి అండగా నిలుస్తున్నారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం నేను ఎల్లప్పుడూ కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గృహనిర్మాణ, ఐ ఆండ్ పీఆర్ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, మారిటైం బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య, తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024
Comments 0