ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరాయే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం: మంత్రి గొట్టిపాటి
ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరాయే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం: మంత్రి గొట్టిపాటి
ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరాయే ప్రభుత్వ లక్ష్యం
లో ఓల్టేజ్ సమస్యలకు చెక్ పెట్టేందుకు సబ్ స్టేషన్ల నిర్మాణం: ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్
కొండేపి: కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజల మీద ఎలాంటి భారం పడకుండా నాణ్యమైన విద్యుత్ ను అందించేందుకు కృషి చేస్తున్నామని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ స్పష్టం చేశారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. ప్రాథమికంగా విద్యుత్ శాఖలో మౌలిక సదుపాయాల కల్పన ద్వారా లో ఓల్టేజ్ సమస్యలు లేకుండా నిరంతరాయ విద్యుత్ సరఫరా ప్రజలకు అందించవచ్చని మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు. ఆదివారం నాడు ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలోని తూర్పునాయుడుపాలెం గ్రామంలో సహచర మంత్రులు డోలా బాల వీరాంజనేయ స్వామి, వంగలపూడి అనితలతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రులు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటు, శంకుస్థాపనలు చేశారు. రూ.4.5 కోట్ల వ్యయంతో తూర్పు నాయుడు పాలెంలో నిర్మించిన 33/11 కే.వీ. విద్యుత్తు ఉప కేంద్రాన్ని మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ.. తూర్పు నాయుడు పాలెంలో ఏర్పాటు చేసిన విద్యుత్ ఉప కేంద్రాన్ని కేవలం ఏడాదిలోనే అందుబాటులోకి తెచ్చామని అన్నారు. ఈ సబ్ స్టేషన్ తో తూర్పు నాయుడుపాలెం, శివాపురం, మల్లవరప్పాడు, సూరారెడ్డిపాలెం, కారుమంచి, వల్లూరు, వసపల్లిపాడు గ్రామాలలో లోవోల్టేజీ సమస్యను అరికట్టవచ్చని తెలిపారు. ముందుగా గ్రామ ప్రవేశ మార్గంలో ఉన్న బి.ఆర్. అంబేద్కర్, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు, మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు విగ్రహాలకు మంత్రులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రూ.2 కోట్లతో నిర్మించనున్న ఎస్సీ కాలనీలోని అంతర్గత సిమెంట్ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. రూ.50 లక్షల వ్యయంతో ఇటీవల స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రహరీ గోడ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమాలలో రాష్ట్ర మారీటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ, రాష్ట్ర టూరిజం బోర్డు చైర్మన్ నూకసాని బాలాజీ, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన రావు, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి, చీరాల ఎమ్మెల్యే ఎం.ఎం.కొండయ్య, ఎర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి గూడూరి ఎరిక్సన్ బాబు, దర్శి నియోజకవర్గ ఇంచార్జ్ గొట్టిపాటి లక్ష్మి, ఇతర ప్రముఖులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. అనంతరం మర్లపాడు గ్రామంలో నందమూరి తారక రామారావు, దామచర్ల ఆంజనేయులు, పరిటాల రవీంద్ర విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024
Comments 0