అద్దంకి నియోజకవర్గ అభివృద్ధి పనులపై మంత్రి గొట్టిపాటి సమీక్ష
అద్దంకి నియోజకవర్గ అభివృద్ధి పనులపై మంత్రి గొట్టిపాటి సమీక్ష
అద్దంకి నియోజకవర్గ అభివృద్ధి పనులపై వివిధ శాఖల అధికారులతో మంత్రి గొట్టిపాటి సమీక్ష...
కొరిశపాడు మండలం, యర్రబాలెం గ్రామంలో అధికారులతో సమావేశమైన మంత్రి గొట్టిపాటి
*ప్రతి ఇంటికీ తాగునీరు – ప్రతీ పంటకు సాగు నీరు లక్ష్యం*
*గాంధీజీ గ్రామ స్వరాజ్య స్థాపన దిశగా గ్రామాల అభివృద్ధి*
*రూ.122 కోట్లతో రహదారులకు మహర్దశ*
*రోల్ మోడల్ గా అద్దంకి నియోజకవర్గం*
*రూ.57 కోట్లతో రక్షిత తాగునీరు పథకం*
*ముంపు గ్రామాలకు పూర్తి స్థాయి మౌలిక వసతులు*
*-ఇంధన శాఖ మంత్రి గొట్టపాటి*
గ్రామాలే దేశానికి పట్టు కొమ్మలు అన్న మహాత్మా గాంధీ మాటలను ఆదర్శంగా తీసుకుని అద్దంకి నియోజకవర్గ పరిధిలోని గ్రామాలను అభివృద్ధి చేస్తున్నామని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. అద్దంకి నియోజకవర్గం కొరిశపాడు మండలంలోని ముంపు గ్రామమైన యర్రబాలెం గ్రామంలో బుధవారం మంత్రి గొట్టిపాటి రవి కుమార్ జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖలకు చెందిన అధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు. నియోజకవర్గంలో చేపట్టిన పనుల పురోగతి పై మంత్రి గొట్టిపాటి వారితో చర్చించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం అర్హులైన చివరి లబ్ధిదారునికి కూడా సంక్షేమ ఫలాలు అందాలనే ధ్యేయంతో ముందుకు వెళ్తుందని ఆయన స్పష్టం చేశారు. అధికారులు కూడా అదే స్పూర్తితో అద్దంకి నియోజకవర్గ అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేయాలని పేర్కొన్నారు. ఆర్.డబ్ల్యూ.ఎస్ కింద రూ.57.50 లక్షలతో ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు అందించే పనులు ప్రారంభించామని అధికారులు మంత్రి గొట్టిపాటికి వివరించారు. పనుల నాణ్యతలో ఎక్కడా రాజీ పడవద్దని మంత్రి సూచించారు. అద్దంకి నియోజకవర్గాన్ని దేశంలోనే రోల్ మోడల్ గా అభివృద్ధి చేసేందుకు అన్ని చర్యలూ చేపడుతున్నామని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు.
*కోట్లాది రూపాయిలతో... బీటీ, సీసీ రోడ్లు....*
అద్దంకి నియోజకవర్గంలోని అన్నీ రహదారులను ఆధునీకరిస్తున్నామని మంత్రి గొట్టిపాటి వెల్లడించారు. అవసరం అయిన ప్రాంతాల్లో తారు రోడ్లతో పాటు సిమెంట్ రోడ్లను కూడా కొత్తగా వేస్తున్నట్లు తెలిపారు. పంచాయితీరాజ్ శాఖకు సంబంధించి రూ.40.46 కోట్లతో బీటీ రోడ్లను, రూ.47 కోట్లతో సీసీ రోడ్లను వేస్తున్నామన్నారు. ఆర్ అండ్ బీ శాఖ పరిధిలో రూ.35.93 కోట్లతో రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని మంత్రి స్పష్టం చేశారు. దీనితో పాటు రూ.11.39 కోట్లతో నియోజకవర్గ వ్యాప్తంగా అందరికీ ఉపయుక్తంగా ఉండేలా 29 కమ్యూనిటీ హాళ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. అదే విధంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటికే 5468 ఇళ్ల సర్వే పూర్తయ్యిందని, మిగిలిన ఇళ్ల సర్వేను కూడా త్వరలోనే పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. 20 గ్రామాల్లో విలేజ్ హెల్త్ సెంటర్ల నిర్మాణం కోసం ఇప్పటికే రూ.7.20 కోట్లు మంజూరు అయ్యాయని, నిర్మాణ పనులు కూడా త్వరగా ప్రారంభించాలని అధికారులను మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఆదేశించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క కిలోమీటర్ రోడ్డును కూడా వేయలేదని, కనీసం గుంతలు కూడా పూడ్చలేదని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు.
*ముంపు గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు...*
అద్దంకి పరిధిలోని ముంపు గ్రామాల అభివృద్ధి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు మంత్రి గొట్టిపాటి వివరించారు. యర్రబాలెం, తమ్మవరం, అనమనమూరు, మనికేశ్వరం, దేనువకొండ, కొటికలపూడి, కుంకుబాడు గ్రామాల వారితో మాట్లాడిన ఆయన వారికి పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలను కల్పించాలని అధికారులను ఆదేశించారు. గత వైసీపీ ప్రభుత్వం ముంపు గ్రామాల అభివృద్ధిని పూర్తిగా ఆపేసిందని ఆయన విమర్శించారు. ముంపు గ్రామాల అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. అదే విధంగా కొరిశపాడు లిఫ్ట్ ఇరిగేషన్ పనులతో పాటు గుండ్లకమ్మ ప్రాజెక్ట్ నిర్వహణ, నీటి నిలుపుదల విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు మంత్రి సూచించారు. అద్దంకి నియోజకవర్గ పరిధిలో లో ఓల్టేజ్ సమస్యలు, విద్యుత్ అంతరాయాలు నివారించడానికి 5 సబ్ స్టేషన్ల నిర్మాణం దశల వారీగా జరుగుతున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. ద్వారకానగర్ లో ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ఒక సబ్ స్టేషన్ ను ప్రజలకు అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు మంత్రి గుర్తు చేశారు. కొత్తగా మరో రెండు సబ్ స్టేషన్లు కూడా అద్దంకి నియోజకవర్గానికి మంజూరు అయినట్లు వెల్లడించారు. తాగునీటి పథకాలు, ఇళ్ల స్థలాలు, రహదారులు, ఇతర అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసి అందరికీ అందుబాటులోకి తీసుకు వస్తామని ఆయన హామీ ఇచ్చారు.
*సోలార్ తో తగ్గనున్న విద్యుత్ ఛార్జీలు.....*
సోలార్ పథకంతో రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు గణనీయంగా తగ్గుతాయని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు ఉచిత సోలార్ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. బీసీలు అయితే రూ.98 వేలు, ఇతరులు రూ.78 వేలు సబ్సిడీ ద్వారా సోలార్ పథకాన్ని వినియోగించుకోవచ్చని మంత్రి వెల్లడించారు. దీనితో పాటు ప్రభుత్వ భవనాలు, పాఠశాలలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలపై సోలార్ ప్యానెల్స్ ను ఏర్పాటు చేసి విద్యుత్ ఛార్జీల భారం తగ్గించేందుకు చర్యలు చేపడుతున్నామని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో ముందుగా రూ.1.20 కోట్లతో నిర్మించిన యర్రబాలెం - తిమ్మనపాలెం తారు రోడ్డును మంత్రి గొట్టిపాటి ప్రారంభించారు. అనంతరం రూ.30 లక్షలతో నిర్మించనున్న దేవాలయ ప్రహరీ గోడకు శంకుస్థాపన చేశారు. రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా ముంపు గ్రామాల ప్రజలతో గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులతో పాటు కూటమి నేతలు పాల్గొన్నారు.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024
Comments 0