పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డామంటున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు
పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డామంటున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు
ఉద్యోగుల మనోగతం :
పెనం మీద నుండి పొయ్యి లో పడ్డాం !!
గత ప్రభుత్వం మాకు కొన్ని అలవెన్సెస్ ఇవ్వలేదు అనే కోపంతో మా వాళ్ళు చాలా మంది ప్రభుత్వానికి వ్యతిరేఖంగా పని చేశాము...
మాతో పాటు ఉపాద్యాయులు...కొందరు ప్రభుత్వ ఉద్యోగులు కలిశారు...
అప్పట్లో తెలుగుదేశం కి అనుకూలంగా ఉండే మా అధికారులు చాలా మంచి రోజులు వస్తాయి... మనలని జాగ్రత్తగా చూసుకుంటారు అని చెప్పి వ్యతిరేఖంగా పని చేయించారు....
కానీ ఈ ప్రభుత్వం వచ్చాక 6 కాబినెట్ సమావేశాలు అయ్యాయి.
మా గోడు పట్టించుకునే వాడు లేడు ..
1) ఇప్పటి వరకు IR మీద నిర్ణయం తీసుకోలేదు .
2) పాత PRC Chairman మీద ఒత్తిడి తెచ్చి క్షణాల్లో రాజీనామా చేయించారు. మళ్ళీ కొత్త Chairman ని పెట్టలేదు .
3) 1 వ తేదీ నే జీతం అనేది గత నెలలో 3 నుండి 5 అయింది. ఈ నెలలో 5 తరవాతే అంటున్నారు .
4) ఉద్యోగ సంఘాల మాట విలువ లేకుండా పోయింది . ప్రజలకి ఇచ్చిన హామీలకే దిక్కు లేదు . మా సంగతి ఎప్పుడు పట్టించుకుంటారో ఏమో
5) Transfers చాలా పారదర్శకంగా చేస్తాం అని చెప్పారు. కట్టలు లేకుండా జరగలేదు .
6 ) చాలా చిన్న చిన్న స్థాయి , గల్లీ లీడర్ లు కూడా బెదిరిస్తున్నారు. మాట్లాడే బాష మీద చాలా అభ్యంతరం ఉంది.
ఏది ఏమైనా రాబోయే రోజులు మహా రంజుగా ఉండబోతున్నాయి...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024
Comments 0