నెల్లూరు, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఓదార్చలేని విషాదాన్ని మిగిల్చిన కర్నూలు బస్సు ప్రమాద ఘటన
నెల్లూరు, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఓదార్చలేని విషాదాన్ని మిగిల్చిన కర్నూలు బస్సు ప్రమాద ఘటన
నాలుగు సంవత్సరాల క్రితం భర్త మరణించినా, ఇంజనీరింగ్ పూర్తి చేసి సాఫ్ట్వేర్ నిపుణురాలిగా ఉద్యోగం చేస్తున్న తన కుమార్తె ఉందనే ధైర్యం కూడా ఆ మాతృమూర్తికి ఆవిరి అయిపోయింది..
యద్దనపూడి మండలం పూనూరు కి చెందిన గన్నమనేని భాను ప్రసాద్ కుమార్తె ఘోర బస్సు ప్రమాదంలో మరణించిన సాఫ్ట్వేర్ ఉద్యోగి ధాత్రి..
బెంగళూరులో ఒక ప్రముఖ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తుంది...
కూతురిని అల్లారు ముద్దుగా పెంచి ఇంజనీరింగ్ చదివించి ఉన్నత స్థాయిలో చూడాలని అనుకున్నారు ఆ తల్లిదండ్రులు...
అయితే భాను ప్రసాద్ మరణించడంతో తన స్వగ్రామమైన ఇంకొల్లు మండలం పూసపాడు కి వచ్చి తన తల్లిదండ్రుల వద్ద ఉంటుంది భాను ప్రసాద్ సతీమణి...
తన కుమార్తె ధాత్రి కి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు... అయితే ఇంతలోనే ఈ ఘోరకలి తన కుమార్తెను కబళించడంతో ఆమె దుఃఖం వర్ణనాతీతం..
ఇక నెల్లూరుకు చెందిన ఒకే కుటుంబంలో నలుగురు మృతి వారి కుటుంబాలలో పెను విషాదాన్నే మిగిల్చింది..
గోళ్ళ రమేష్ 35 స్వయంగా తన అక్కయ్య కూతురినే (అనూష ) వివాహం చేసుకున్నాడు..
అటు తన తల్లిని, తన అక్కయ్యను ప్రసాద్ ఎంతో ఆదరభిమానాలతో చూసుకుంటున్నారు..
అన్యోన్యంగా జీవిస్తున్న కుటుంబంలో ప్రసాద్ తన భార్య ఇద్దరు పిల్లలతో సహా అకాల మరణం చెందటం ఆ రెండు కుటుంబాలలో తీరని విషాదాన్నే మిగిల్చింది..
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024
Comments 0