11 మంది డెడ్ బాడీ లు గుర్తింపు... కాలం చెల్లిన బస్సుతో ప్రయాణికులకు ప్రాణ సంకటం.. డ్రైవర్ క్లీనర్ల నిర్లక్ష్యం
11 మంది డెడ్ బాడీ లు గుర్తింపు... కాలం చెల్లిన బస్సుతో ప్రయాణికులకు ప్రాణ సంకటం.. డ్రైవర్ క్లీనర్ల నిర్లక్ష్యం
హైదరాబాదు నుండి బెంగుళూరు వెళ్తున్న ఒక ప్రైవేటు ట్రావెల్ బస్సు లో అగ్ని ప్రమాదం సంభవించి బస్సులో 41 మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు..
అర్ధరాత్రి సమయంలో కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద బస్సును ఒక మోటార్ బైకు ఢీకొంది..
ఈ సందర్భంలో బస్సులోని ఫ్యూయల్ ట్యాంకు నుండి ఫ్యూయల్ బయటికి రావడంతో ఈ ప్రమాదం సంభవించి ఉంటుందని ప్రాథమిక అంచనా..
41 మంది ప్రయాణికులలో దాదాపు 21 మంది క్షేమంగా ఉన్నట్లు సమాచారం..
ఇప్పటికి 11 డెడ్ బాడీలను గుర్తించారు..
ఈ బస్సు కూడా 2025 మార్చి నెల వరకే కాల పరిమితి ఉన్నట్లు అధికారులు గుర్తించారు..
బస్సు బైక్ను ఢీకొన్న సమయంలో బస్సు ను ఆపి ఉంటే ఈ తీవ్ర ప్రమాదం జరిగి ఉండేది కాదని భావిస్తున్నారు..
బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సు ని ముందుకు పోనీయడంతో ఫ్యూయల్ మండి అగ్నికీలలు బస్సు మొత్తం వ్యాప్తి చెందాయి..
కనీసం బస్సు డ్రైవరు క్లీనర్లు బస్సులో ఉన్న ప్రయాణికులను కూడా అలర్ట్ చేయకపోవడంతో నిద్రవస్థలో ఉన్న బస్సులో ఉన్న దాదాపు 20 మంది బస్సు నుండి బయటకి వచ్చే అవకాశం లేకుండా పోయింది...
ఇద్దరు పసిబిడ్డలు కూడా ఈ ప్రమాదంలో చిక్కుకుపోయినట్లు సమాచారం..
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024
Comments 0