తిరుపతి లడ్డు అంశంలో వెలుగులోకి వస్తున్న సంచలన విషయాలు లడ్డు నాణ్యతను టెస్ట్ చేసిన నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ అధికార బృందం జులై 5న టిటిడి ఈవో శ్యామలరావును కలిసింది
తిరుపతి లడ్డు అంశంలో వెలుగులోకి వస్తున్న సంచలన విషయాలు లడ్డు నాణ్యతను టెస్ట్ చేసిన నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ అధికార బృందం జులై 5న టిటిడి ఈవో శ్యామలరావును కలిసింది
తిరుమల లడ్డు విషయంలో ఒక్కొక్క అంశం వెలుగులోకి వస్తుంది... నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ చైర్మన్ నితిన్ షా జులై 5న టిటిడి కార్యనిర్వాహణాధికారి శ్యామలరావును కలిసింది..
ఈ సందర్భంగా తిరుమల లడ్డు తయారీ సరఫరా అయ్యే నెయ్యి ప్యూరిటీని నేషనల్ డైరీ డెవలప్మెంట్ అనుబంధ సంస్థ అయిన ఎన్డిడిబి కాఫ్ కు ఇచ్చే అంశం పై చర్చలు జరిగాయి..
ఈ విషయాన్ని స్వయంగా నేషనల్ డైరీ డెవలప్మెంట్ జూలై5 అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసింది..
ఈ నేపథ్యంలో జులై 6న ఏఆర్ డైరీ పంపిన 10 ట్యాంకర్లలో నాలుగు ట్యాంకర్ల పాలు కల్తీ ఉందని ప్రకటించడం తరువాత ఎన్ డి డి ఎఫ్ కాఫ్ సంస్థకు చెకింగ్ కి పంపించడం అనంతరం టెస్ట్ రిజల్ట్ వచ్చిన తర్వాత వెజిటబుల్ ఫ్యాట్ ఉందని శ్యామల రావు ప్రకటించడం అనంతరం చంద్రబాబు నాయుడు జంతువుల కొవ్వు కలిసి ఉందని ప్రకటించడం చంద్రబాబు ప్రకటన అనంతరం మరల ఈవో శ్యామల రావు జంతువుల కొవ్వు ఉన్నట్లు నిర్ధారణ అయిందని ప్రకటించడం చకచకా జరిగిపోయాయి...
అయితే ఆ నాలుగు ట్యాంకర్ల పాలు కల్తీవీగా గుర్తించడంతో లడ్డూల వాడకం లో అవి వినియోగించకుండా తిప్పి పంపినట్లు శ్యామల రావు అంగీకరించారు మరి ఇక లడ్డూలలో కల్తీ ఎక్కడ జరిగిందో చంద్రబాబు కేవలం రాజకీయం చేసేందుకు ఈ అంశాన్ని వాడుకున్నారనేది స్పష్టం అవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు తెలుగుదేశం అభిమానులు సైతం ఈ రకమైన ప్రకటన చంద్రబాబు చేయడంపై ఒకెంత విస్మయం వ్యక్తం చేస్తున్నారు..
తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ట ఈ ప్రకటన ద్వారా పలుచన చేయడమే అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు..
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024
Comments 0