భారీగా బంగారు ఆభరణాలు పట్టివేత... దాదాపు 14 కోట్ల రూపాయల విలువ
భారీగా బంగారు ఆభరణాలు పట్టివేత... దాదాపు 14 కోట్ల రూపాయల విలువ
నేషనల్ హైవే 65వ నెంబర్ రహదారిపై కంచికచర్ల మండలం పేరకలపాడు అడ్డరోడ్డు వద్ద భారీగా బంగారు వెండి ఆభరణాలను ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ పట్టుకుంది..
స్క్వాడ్ ఇంచార్జ్ కె. బాల శంకర్రావు ఉదయం ఏడు గంటల ప్రాంతంలో వాహనాలు తనిఖీ చేసే సమయంలో హైదరాబాదు నుండి విజయవాడ వైపు వెళ్తున్న BVC లాజిస్టిక్స్ వాహనాన్ని తనిఖీ చేయగా భారీగా బంగారు వెండి ఆభరణాలు పట్టుబడ్డాయి..
దాదాపు 14 కోట్ల విలువైన ఆభరణాలుగా అంచనా వేశారు...
అయితే విజయవాడలోని మలబార్.. కళ్యాణ్...లలిత తదితర జువెలరీ దుకాణాలకు అందజేసేందుకు వెళుతుండగా ఈ ఆభరణాలు పట్టుబడ్డాయి...
అయితే ఈ ఆభరణాలకు సంబంధించి అన్ని రకాల బిల్లులు ఉన్నట్లు కనుగొన్నారు..
సదరు బిల్లులు లో ఉన్నటువంటి మొత్తం ప్రకారం బంగారు వెండి ఆభరణాలు ఉన్నాయా లేవా అనేది తేలవలసి ఉంది..
ఈ లాజిస్టిక్స్ కి తెలంగాణ రాష్ట్రం వరకే పర్మిషన్ ఉంది కానీ ఆంధ్రా లో పర్మిషన్ లేనట్లుగా గుర్తించారు..
ఈ అంశాలపై స్క్వాడ్ అధికారులు పోలీసుల సహకారంతో దర్యాప్తు చేస్తున్నారు
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024
Comments 0