మరలా విజయం మాదే..అద్దంకి.. పర్చూరు...రేపల్లె శాసనసభ్యులు..
మరలా విజయం మాదే..అద్దంకి.. పర్చూరు...రేపల్లె శాసనసభ్యులు..
అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్... పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు.... రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సందర్శించుకున్నారు..
తిరుమలేశుని సందర్శన అనంతరం..
మాదే విజయం అన్నట్లుగా చిరునవ్వు చిందిస్తూ ఫోటో దిగారు...
రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్... పర్చూరు ఎమ్మెల్యే సాంబశివరావు... అద్దంకిలో గొట్టిపాటి 2019 ఎన్నికలలో వైసిపి ప్రభంజనాన్ని తట్టుకొని కూడా గెలుపొందారు..
అయితే అధికార పార్టీకి ఈ మూడు నియోజకవర్గాలు కొరకరాని కొయ్యగా తయారయ్యాయి...
గొట్టిపాటికి దీటుగా పలు ప్రతిపాదనలు వైసీపీ అధిష్టానం చేసినప్పటికీ సిద్ధ రాఘవరావు... కరణం బలరాం లాంటివాళ్ళు అద్దంకిలో పోటీ చేసేందుకు సుముఖత చూపలేదు..
పెదకూరపాడు నియోజకవర్గానికి చెందిన పానెం చిన్న హనిమిరెడ్డి అద్దంకిి పోరులో దిగి తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు...
ఇక పర్చూరు లో సాంబశివరావును ఎదుర్కొనేందుకు రావి రామనాథం..
తరువాత ఆమంచి కృష్ణమోహన్ ఇన్చార్జిలుగా వ్యవహరించారు..
ఆమంచి కృష్ణమోహన్ పర్చూరులో పోటీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేయకపోవడంతో ఎడం బాలాజీ బరిలో దిగి పోటీ చేశారు..
రేపల్లెలో అనగాని సత్యప్రసాద్ ని ఎదుర్కునేందుకు మోపిదేవి వెంకటరమణను కాదని మాజీ ఎమ్మెల్యే ఈవూరి సీతారావమ్మ కుమారుడు డాక్టర్ ఈవూరి గణేష్ ను ఎన్నికల బరిలో అధిష్టానం దింపింది..
అద్దంకి... పర్చూరు పోటా పోటీగా ఉంటుందని వైసీపీ వర్గాలు భావిస్తుండగా.. రేపల్లె లో అనగాని సత్యప్రసాద్ తిరిగి ఎమ్మెల్యే కావడం ఖాయం అనే వార్తలు వస్తున్నాయి..
భారీ మెజారిటీలు రాకపోయినా అద్దంకి పర్చూరు లో కూడా 5000 లోపు మెజారిటీతో టిడిపి బయటపడుతుందని ఆశలు ఆ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024
Comments 0