మాట మార్చుడే మార్చుడు.. తిరుమల విఐపి బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లెటర్లకు వారంలో ఆరు రోజులు ఆమోదం..
మాట మార్చుడే మార్చుడు.. తిరుమల విఐపి బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లెటర్లకు వారంలో ఆరు రోజులు ఆమోదం..
ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం సందర్శించినప్పుడు బ్రహ్మోత్సవాల సందర్భంగా వీఐపీ బ్రేక్ దర్శనాల సంస్కృతికి అడ్డుకట్ట వేయాలి అన్న సీఎం చంద్రబాబు మరలా మాట మార్చారు..
ఎమ్మెల్యే ఎంపీలు ఇతర సిఫార్సు లెటర్ ల మీద వారంలో నాలుగు రోజులు మాత్రమే విఐపి బ్రేక్ దర్శనాలకు ప్రస్తుతం అనుమతి ఉంది..
అయితే కూటమి ఎమ్మెల్యేలు ఎంపీల సమావే శం లో సీఎం చంద్రబాబు వారి కోరిక మేరకు వారంలో ఆరు రోజులు..ఆయా సిఫార్సు లెటర్ ల బ్రేక్ దర్శనాలకు అనుమతి ఇచ్చేందుకు ఓకే అన్నారు..
అంతే కాదు ప్రతిరోజు సుపధం 300 రూపాయల శీఘ్రదర్శన టికెట్లు ఒక్కొక్క ఎమ్మెల్యే ఎంపీకి ఆరు రోజులు రోజుకి 6 చొప్పున ఇచ్చేందుకు అంగీకరించారు..
గత ప్రభుత్వ హయాంలో వారానికి విఐపి బ్రేక్ దర్శనాలు ఐదు రోజులు లేదా భక్తుల ఒత్తిడిని బట్టి నాలుగు రోజులు మాత్రమే ఇచ్చేవారు..
300 రూపాయల శీఘ్రదర్శన టికెట్లకు ప్రత్యేక రోజు వారి అనుమతి ఎమ్మెల్యేలకు ఎంపీలకు లేదు...
అయితే ఇప్పుడు ఈ తాజా మార్పులు చేస్తూ చంద్రబాబు తీసుకున్న నిర్ణయం విస్మయానికి గురిచేస్తుంది..
ఎప్పుడు ఎలా మాట మారుస్తారో సీఎం చంద్రబాబుకే ఎరుక అని విమర్శలు వినవస్తున్నాయి..
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024
Comments 0