మాజీ శాసనసభ్యులు అద్దంకి నియోజకవర్గ వైసిపి సీనియర్ నాయకుడు చెంచు గరటయ్య ఆయన కుమారుడు బాచిన కృష్ణ చైతన్య వైసీపీ నుండి సస్పెన్షన్
మాజీ శాసనసభ్యులు అద్దంకి నియోజకవర్గ వైసిపి సీనియర్ నాయకుడు చెంచు గరటయ్య ఆయన కుమారుడు బాచిన కృష్ణ చైతన్య వైసీపీ నుండి సస్పెన్షన్
ఉండవల్లి లోని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు నివాసంలో అద్దంకి వైసిపి నాయకులు బాచిన చెంచు గరటయ్య, బాచిన కృష్ణ చైతన్య చంద్రబాబు నాయుడుని కలిశారు...
అద్దంకి నియోజకవర్గ వైసిపి ఇన్చార్జిగా మొన్న మొన్నటి వరకు పనిచేసిన కృష్ణ చైతన్యను తొలగించడంతో నూతనంగా బాధ్యతలు పానం హనిమిరెడ్డికి ఇచ్చారు సీఎం జగన్ మోహన్ రెడ్డి...
అయితే భవిష్యత్తులో బాచిన కృష్ణ చైతన్యకు తప్పనిసరిగా న్యాయం చేస్తానని, ప్రస్తుత నూతన ఇంచార్జ్ హనిమిరెడ్డికి సహాయ సహకారాలు అందించి ఆయన గెలుపుకు కృషి చేయవలసిందిగా సీఎం జగన్ మోహన్ రెడ్డి వారిని కోరారు...
అయితే తనకే టికెట్ కావాలని ప్రయత్నాలు చేసినప్పటికీ ఎలాంటి సానుకూల స్పందన అధిష్టానం నుండి రాలేదు...
ఇప్పటికే వైసీపీ క్యాడర్ పాణం హనిమిరెడ్డి వెంట నడుస్తుంది..
ఎవరైతే తెలుగుదేశం నుండి వైసీపీలోకి వలస వచ్చారో వారే తిరిగి సొంత గూటికి కొందరు వెళ్లారు.. మరికొందరు వెళ్లేందుకు రంగ సిద్ధం చేసుకుంటున్నారు....
ఈ నేపథ్యంలో బాచిన ధ్వయం మొన్న మొన్నటి వరకు అధికారం చెలాయించిన వైసీపీలో ఇమడలేని పరిస్థితి రావడంతో తెలుగుదేశం పార్టీలో చేరేందుకు చంద్రబాబును కలిశారు...
వెంటనే వైసీపీ అధిష్టానం వీరు ఇరువురిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది..
అయితే ఈ సందర్భంగా గతంలో వైసిపికి ఆది నుండి పనిచేస్తున్న మాజీ ఎమ్మెల్యే జాగర్లమూడి రాఘవరావు కుమార్తె విక్రమ్ శ్రీదేవిని.. కరణం సుబ్బయ్యను అకారణంగా బాచిన కృష్ణ చైతన్య అధిష్టానానికి చెప్పి సస్పెన్షన్ వేటు వేయించారని...ఇప్పుడు తనే సస్పెన్షన్ వేటుకు గురికావలసి వచ్చిందని ఆయన వ్యతిరేక వర్గం, వారి సస్పెన్షన్ పై స్పందిస్తున్నారు...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024
Comments 0