సోమవారం రాత్రి సీఎం జగన్మోహన్ రెడ్డిని తన కుమారుడు ప్రణీత్ రెడ్డితో కలిసి భేటీ అయిన బాలినేని
సోమవారం రాత్రి సీఎం జగన్మోహన్ రెడ్డిని తన కుమారుడు ప్రణీత్ రెడ్డితో కలిసి భేటీ అయిన బాలినేని
ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అనుకున్న విధంగా సోమవారం రాత్రి సీఎం జగన్మోహన్ రెడ్డిని తన కుమారుడు ప్రణీత్ రెడ్డితో కలిసి భేటీ అయ్యారు..
బాలినేని ఒంగోలు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీకి సత్వరమే నిధులు మంజూరు చేయాలని కోరారు ఈనెల 20 25 తేదీల మధ్య పట్టాల పంపిణీ చేసేందుకు అనుగుణంగా మార్గం చేయాలని కోరారు అదే విధంగా మంచినీటి సమస్య పరిష్కారానికి మంజూరైన నిధులు కూడా విడుదల చేయాలని కోరినట్లు సమాచారం..
ఈ చర్చలలో ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ అని చెబుతున్న ప్రకాశం జిల్లాలో అభ్యర్థుల విజయానికి బాలినేని చెవిరెడ్డి భాస్కర రెడ్డితో కలిసి మంచి ఫలితాలను రాబట్టాలని సీఎం జగన్ సూచించినట్లు సమాచారం అదేవిధంగా భవిష్యత్తులో తనకు మంచి స్థానాన్ని కల్పిస్తానని సీఎం జగన్ బాలినేనిని బుజ్జగించినట్లు సమాచారం..
ఇక మార్కాపురం జంకె వెంకటరెడ్డికి ఆంధ్రప్రదేశ్ ఇఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి... ఒకానొక దశలో మార్కాపురం అభ్యర్థిగా జంకె వెంకటరెడ్డి పేరు తెర పైకి వచ్చినప్పటికీ ఆయనకు ఉన్న ఆర్థిక పరిస్థితుల రీత్యా ఆయనకు టికెట్ కేటాయించలేదు... ఈ నేపథ్యంలో కార్పొరేషన్ చైర్మన్ పదవిని కట్టబెడుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి...
కొసమెరుపు :
ఇకనైనా బాలినేని అలక పాన్పు ఎక్కకుండా తన గెలుపుతో పాటు పలు నియోజకవర్గాలలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో విస్తృత పరిచయాలు ఉన్న ఆయన మిగిలిన అభ్యర్థుల విజయ అవకాశాలను మెరుగుపరిచే విధంగా కృషి చేయాలని వైసీపీ అభిమానుల ప్రగాఢ కోరిక.. అంతేకాకుండా మీడియా ముందు ఆవేశానికి గురి కాకుండా హుందాగా వ్యవహరించాలని మరి మరి కోరుతున్నారు అభిమానులు...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024
Comments 0