రోజుకో మాట..పూటకో పాట.. పెన్షన్ల పై మరల యూటర్న్ తీసుకున్న చంద్రబాబు
రోజుకో మాట..పూటకో పాట.. పెన్షన్ల పై మరల యూటర్న్ తీసుకున్న చంద్రబాబు
తాజాగా నారా చంద్రబాబు నాయుడు మరో కొత్త పల్లవి అందుకున్నారు..
కావాలనే కుట్రలకు ముఖ్యమంత్రి జగన్ వైసీపీ ప్రభుత్వం పాల్పడుతుందని..
పెన్షన్లు ప్రతి ఒక్కరికి ఇంటింటికి తిరిగి ఇవ్వమంటే బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం ఏంటని ఈరోజు ఆయన తీవ్ర స్వరంతో విమర్శించారు..
వాస్తవంగా నిమ్మగడ్డ రమేష్ ఎలక్షన్ కమిషన్ కు వాలంటీర్ల ద్వారా పెన్షన్ ఆపమని చెప్పడంతో పాటు..
ప్రత్యామ్నాయంగా బ్యాంక్ అకౌంట్ లలో లబ్ధిదారులకు పెన్షన్ అందే ఏర్పాటు చేయాలని సూచించారు..
పోయిన నెల వాలంటీర్లను పెన్షన్ విధుల నుండి తప్పించిన తర్వాత టిడిపి తన తప్పును సవరించుకునే మార్గంలో భాగంగా మొదట బ్యాంకు ఖాతాల్లో వేయాలని నేరుగా అభ్యర్థించి... తర్వాత వెంటనే ఇంటింటికి సచివాలయ సిబ్బంది వెళ్లి పంపిణీ చేయాలని చంద్రబాబు,టిడిపి నాయకులు కోరారు...
బిజెపి రాష్ట్ర అధ్యక్షరాలు పురందేశ్వరి కూడా డిబిటి పద్ధతిలో పింఛన్లు లబ్ధిదారులకు అందించాలని కోరారు
కానీ సచివాలయాలకు వచ్చి వృద్ధులు ఎలాగోలా తంటాలు పడి తీసుకున్నారు...
పెన్షన్ తీసుకునే క్రమంలో కారణాలు ఏమైనా కానీ 30 మంది దాకా వృద్ధులు మృతి చెందారు..
అయితే దివ్యాంగులకు మాత్రం..కొన్ని ప్రత్యేక అంశాల ఆధారంగా చేసుకుని మరి కొందరికి.. సచివాలయ సిబ్బంది స్వయంగా ఇంటికి వెళ్లి ఇవ్వడం జరిగింది..
ఈనెల పింఛన్ల పంపిణీ ఎలక్షన్ కమిషన్ సూచనల మేరకు నేరుగా బ్యాంకు ఖాతాలు ఉన్నవారి అకౌంట్లో పింఛన్ డబ్బులు జమ చేయాలని ఆ మేరకు 48 లక్షల మందికి డైరెక్ట్ గా ఖాతాలో జమ చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది..
మిగిలిన 17 లక్షల మంది లో బ్యాంకు ఖాతాలు లేని వారు.. దివ్యాంగులు.. ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి నేరుగా సచివాలయ సిబ్బంది వారి ఇళ్లకు వెళ్లి అందిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది....
అయితే అలా చేయడం కూడా కరెక్ట్ కాదని అధికారులందరూ కుమ్మక్కై ఈ విధంగా పింఛనుదారులను ఇబ్బంది పెట్టడం తగదని చంద్రబాబు విమర్శించారు...
ప్రతి ఒక్క పింఛనుదారుడుకి ఇంటికి వెళ్లే అందించాలి అని డిమాండ్ చేశారు..
అయితే ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడతారు అన్న చందాన టిడిపి పరిస్థితి ఉందని తేటతెల్లమవుతుంది..
రోజువారి విధుల్లో ఎలక్షన్ పనుల ఒత్తిడి తో బాగా బిజీగా ఉండే సిబ్బంది పింఛన్లు ఇంటింటికి ప్రతి ఒక్కరికి ఎలా అందించగలుగుతారు అనేది ప్రశ్న...
ఆ మాత్రం తెలియదా అనే విమర్శలు సచివాలయ సిబ్బంది నుండి ఇటు విజ్ఞుల నుండి ఎదురవుతున్నాయి...
ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు అనే నానుడి టిడిపికి వర్తిస్తుంది అని స్పష్టం అవుతుంది...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024
Comments 0