తమ సమస్యల పరిష్కారానికి చలో విజయవాడ పేరుతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ నెల 27న చేపట్టిన కార్యక్రమం తాత్కాలిక వాయిదా
తమ సమస్యల పరిష్కారానికి చలో విజయవాడ పేరుతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ నెల 27న చేపట్టిన కార్యక్రమం తాత్కాలిక వాయిదా
రాష్ట్ర ఉద్యోగులకు రావలసిన ఆర్థిక ఆర్థికేతర ప్రయోజనాలు నెరవేర్చేందుకు ప్రభుత్వం రాతపూర్వక హామీ ఇచ్చిందని ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర చైర్మన్ బండి శ్రీనివాసరావు తెలిపారు...
ఉద్యోగులకు సత్వరమే 12వ పిఆర్సి ప్రయోజనాలు కల్పించేలా పిఆర్సి కమిషన్ వేగంగా పనిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కాబట్టి మధ్యంతర భృతి అవసరం లేదని ప్రభుత్వం చెప్పినట్లు తెలిపారు...
ఉద్యోగుల వైద్య ఖర్చుల నిమిత్తం ఆస్పత్రులకు చెల్లించాల్సిన మొత్తం లో 70 కోట్లు రూపాయలు, సిపిఎస్ ఉద్యోగులకు టీఏడీఏల నిమిత్తం చెల్లించాల్సిన మొత్తంలో 100 కోట్లను త్వరగా విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రుల బృందం స్పష్టం చేసినట్లు తెలిపారు...
పెన్షనర్ల డిమాండ్లలో ప్రధానమైన క్వాంటం ఆఫ్ పెన్షన్లు మార్పులకు చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేసినట్లు తెలిపారు...
కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ విషయం.. ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు 30 శాతం జీతం పెంపు కూడా తమ ఒప్పందంలో ఉందన్నారు...
ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వం రాతపూర్వకంగా చేసుకున్న ఒప్పందం ప్రకారం డిమాండ్లను మార్చే నెలాఖరు నాటికి పూర్తిగా నెరవేస్తుందని ఆశాభావంతో తమ ఆందోళనను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు తెలిపారు..
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024
Comments 0