ప్రస్తుత వైసిపి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు 1998లో శిరోముండనం కేసు నుండి తప్పించేందుకు జీవో జారీ చేసిన చంద్రబాబు ప్రభుత్వం...
ప్రస్తుత వైసిపి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు 1998లో శిరోముండనం కేసు నుండి తప్పించేందుకు జీవో జారీ చేసిన చంద్రబాబు ప్రభుత్వం...
వైయస్సార్సీపి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కు వెంకటాయపాలెం శిరోముండనం కేసులో 15 నెలల జైలు శిక్షను విశాఖ కోర్టు విధించింది..
ఈ అంశాన్ని కూడా తెలుగుదేశం పార్టీ తన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో రాజకీయం చేయాలని చూస్తుంది...
1996లో తనకు అనుకూలంగా రిగ్గింగ్ చేయకుండా వెంకటాయపాలెం దళితులు అడ్డుకున్నారని కక్షగట్టి ఐదుగురు దళిత యువకులకు శిరోమండనం చేసినట్లు త్రిమూర్తులపై కేసు నమోదయింది..
ఈ సంఘటన జరిగిన సమయంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది..
గురువింద గింజ తన నలుపు ఎరుగనట్లు 1998లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు ప్రభుత్వం తోట త్రిమూర్తులను కేసు నుండి తప్పించేందుకు రెండుసార్లు జీవో తెచ్చింది...
అయితే బొజ్జా తారకం వంటి దళిత నాయకులు దళిత సంఘాలు ఈ అంశాన్ని వ్యతిరేకిస్తూ జీవోలకు వ్యతిరేకంగా కోర్టులో పోరాటం జరిపాయి..
మరలా 2000 సంవత్సరం లో చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన జీవోలను కొట్టివేస్తూ కోర్టులో కేసు పై విచారణ జరిగింది..
చివరకు దళితులకు ఈ కేసులో తోట త్రిమూర్తులకు 15 నెలలు శిక్ష విధిస్తూ విశాఖ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది..
ఈ సందర్భంగా తోట త్రిమూర్తులు మాట్లాడుతూ తనకు శిరోమండనం కేసులో ఎలాంటి ప్రమేయం లేదని తనపై కొందరు కుట్రపూరితంగా కేసులో ఇరికించారని తెలిపారు..
ఇక ఈ కేసులో త్రిమూర్తులుకు బెయిల్ మంజూరు అయింది..
తెలుగుదేశం ప్రభుత్వం తన హయాంలో ఆయనను ఆ కేసు నుండి తప్పించే జీవోలను తెచ్చి ప్రస్తుతం దళితులకు ద్రోహం చేసిన తోట త్రిమూర్తులు కి వైసీపీ ఎమ్మెల్సీ గా కట్ట పెట్టిందని తన సోషల్ మీడియాలో అక్కసు వెలగక్కటం టిడిపి చౌకబారుతనాన్ని సూచిస్తుందని చెప్పక తప్పదు..
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024
Comments 0