అమిత్ షా తో ముగిసిన భేటీ.. 145 అసెంబ్లీ 17 ఎంపీ స్థానాలలో పోటీ చేయనున్న టిడిపి
అమిత్ షా తో ముగిసిన భేటీ.. 145 అసెంబ్లీ 17 ఎంపీ స్థానాలలో పోటీ చేయనున్న టిడిపి
ఇంతన్నాడంతన్నాడే గంగరాజు అన్న సామెతన తయారైంది బిజెపి జనసేన పరిస్థితి...
కేవలం 30 అసెంబ్లీ స్థానాలు 8 ఎంపీ స్థానాలలో బిజెపి జనసేన పార్టీలు పోటీ చేయనున్నాయి... మిగిలిన 145 వ అసెంబ్లీ స్థానాలు 17 ఎంపీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థులను నిలబెట్టనుంది..
ఈ మేరకు అమిత్ షా తో జరిగిన భేటీలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ పొత్తులపై ఈ నిర్ణయం తీసుకున్నారు...
దాదాపు గంటసేపు చర్చలు జరిగాయి...
ఈ మేరకు రెండు మూడు రోజుల్లోనే పొత్తులు... ఎన్నికలకు సమాయత్తంపై మూడు పార్టీలు కీలక ప్రకటన చేయనున్నాయి..
పాపం రెండోసారి ప్రకటించే లిస్టులోనైనా జనసేన కొన్ని సీట్లను పెంచుకుంటుంది అనే ఆశా భావాన్ని జనసేన నాయకులు వ్యక్తం చేశారు...
అయితే వారి ఆశలు అడియాసలయ్యాయి..బొలిశెట్టి సత్యనారాయణ లాంటి జనసేన నాయకులు మొదటి లిస్టు ప్రకటన అనంతరం కేవలం 24 సీట్లలో పోటీ చేయడం ద్వారా ఓట్లు ట్రాన్స్ఫర్ కావు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు...
రెండవ లిస్టు ప్రకటనకు ముందు కనీసం 10 సీట్లు అయినా జనసేన కు పొత్తులో భాగంగా అదనంగా కేటాయిస్తారు అని ఆశాభావం వ్యక్తం చేశారు...
కానీ అలాంటి.. వాళ్ళ ఆకాంక్షకు ఎలాంటి విలువ లేకుండా పోయింది...తాడేపల్లిగూడెంలో జండా సభ లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ తన వైఖరి ఏంటో చెప్పకనే చెప్పారు...
వైసీపీని గద్దె దించడమే ప్రధాన లక్ష్యం అని జన సైనికులు సంస్థాగతంగా బలపడలేదని అలాంటప్పుడు సీట్ల విషయంలో రాజీ పడక తప్పదు.. తనకు ఎవరు సలహాలు సూచనలు ఇవ్వవలసిన అవసరం లేదని స్పష్టంగా చెప్పారు.. మరి ఇక జనసైనికులు రానున్న ఎన్నికలలో ఎలా పని చేస్తారు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న..
ఇక బిజెపి పార్టీ కూడా ఇచ్చిన సీట్లతోనే సర్దుకుపోవడం ఆశ్చర్యకరమైన పరిణామం...
అంటే వాళ్ల వాస్తవ పరిస్థితిని గ్రౌండ్ లెవెల్ లో ఆంధ్రప్రదేశ్ లో ఎలా ఉంది అనేది ఒప్పుకున్నట్లే...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024
Comments 0