జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు ఎలాంటి ఆందోళన చెందవద్దు అని స్పష్టం చేసిన పశు వైద్యాధికారి బేబీ రాణి
జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు ఎలాంటి ఆందోళన చెందవద్దు అని స్పష్టం చేసిన పశు వైద్యాధికారి బేబీ రాణి
నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ ప్రభావం అధికంగా ఉందని ప్రకాశం జిల్లా పశు వైద్యాధికారి బేబీ రాణి తెలిపారు...
ఇప్పటికైతే ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవని స్పష్టం చేశారు.. అయితే నెల రోజులు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ప్రజలను, పౌల్ట్రీ యజమానులను, చికెన్ షాప్ నిర్వాహకులను కోరారు..
బర్డ్ ఫ్లూ లక్షణాలు ఉన్న మాంసం తింటే అవి మనుషులకు కూడా సోకే ప్రమాదం ఉందని తెలిపారు..
చికెన్ గుడ్లు బాగా ఉడకబెట్టి తినాలని కోరారు.. తద్వారా ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు..
ఇప్పటికే తనతో పాటు పశుసంవర్ధక అధికారులు జిల్లాలో పలు చోట్ల ఫీల్డ్ విజిట్లు చేసి ప్రజలను అలర్ట్ చేసామని తెలిపారు..
నెల్లూరు నుండి బాయిలర్ చికెన్, పౌల్ట్రీ ఫీడ్ రవాణాను కొన్నాళ్లు నిలిపివేయాలని చెక్ పోస్ట్ ల వద్ద చెకింగ్ పటిష్టంగా చేయాలని చెక్ పోస్టుల అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు... ఒక నెల రోజులు జాగ్రత్త వహిస్తే బర్డ్ ఫ్లూ ప్రభావం పూర్తిగా తగ్గిపోతుంది అని ఆమె సూచించారు...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024
Comments 0