కర్ణాటక...తెలంగాణ రాజ్యసభ ఎన్నికలలో అభ్యర్థిగా కానరాని షర్మిల పేరు
కర్ణాటక...తెలంగాణ రాజ్యసభ ఎన్నికలలో అభ్యర్థిగా కానరాని షర్మిల పేరు
షర్మిలకు రిక్త హస్తమేనా?
షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరే ముందు కర్ణాటక నుండి రాజ్యసభకు పంపేందుకు హామీ లభించినట్లు ఒక ప్రచారం అయితే జరిగింది...
అయితే రాజ్యసభ ఎన్నికలు ఈ నెలలో జరగనున్న దృష్ట్యా ఆమె పేరు కనీసం పరిశీలన కూడా కాంగ్రెస్ హైకమాండ్ చేయలేదు..
అయితే రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలిగా ఆంధ్రప్రదేశ్లో కీలకమైన బాధ్యత ఇచ్చిన కారణంగా వెంటనే రాజ్యసభ అభ్యర్థిగా ఎలా ప్రకటిస్తారనే వాదన కూడా ఉంది...
ఇప్పటికిప్పుడు అద్భుతమైన ఫలితాలు ఆంధ్రప్రదేశ్లో షర్మిల నియామకం వల్ల కాంగ్రెస్ పార్టీకి అందే అవకాశం అయితే లేదు...
తెలివిగా కాంగ్రెస్ అధిష్టానం వైయస్ రాజశేఖర్ రెడ్డి తనయగా ఆమెను కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షురాలిగా చేయడం ద్వారా రాజ్యసభ ఊసే ఆమె ప్రస్తావించే అవకాశం లేకుండా వ్యూహ రచనలో భాగంగా ఆమెకు పిసిసి బాధ్యతలు అప్పగించారనే వాదన ఉంది..
కొండా రాఘవరెడ్డి వంటివాళ్లు చెప్పిన విధంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తో కుదిరిన ఆర్థిక ఒప్పందంతోపాటు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు ఆంధ్రప్రదేశ్లో చేపడితే ఉపయోగం ఉంటుందని ఆలోచన షర్మిల మదిలో ఉండి ఉండవచ్చు...
ఇందులో భాగంగానే ఆమె, రాజ్యసభ స్థానాలు కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్ లలో అభ్యర్థులు ఎవరనేది కాంగ్రెస్ పార్టీ ప్రకటించినా కిమ్మనకుండా ఉందనే రాజకీయ పరిశీలకుల అంచనా..
అయితే కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం తేవాలంటే రాష్ట్రంలో అంత తేలికైన విషయం ఏమీ కాదు.,
ఏప్రిల్ లో జరగనున్న లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారం చేపడుతుందని నమ్మకం లేదు...
ఇండియా కూటమిలో కూడా ఇప్పటికే అభిప్రాయ బేధాలు వచ్చి మమతా బెనర్జీ వంటి వారు దూరం జరుగుతున్నట్లు ప్రకటించారు...
మరి షర్మిల ఇటీవల ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ తరఫున చేసిన ప్రచార కార్యక్రమాల లో ప్రజల నుండి స్పందన ఏమాత్రం లేదు...
రాజశేఖర్ రెడ్డి కుమార్తెగా ఆమె ఏమి చెబుతుంది అనే ఆసక్తితో కొద్దో గొప్పో జనాలు వచ్చి ఉండొచ్చు...
కాంగ్రెస్ పార్టీ నుండి వైయస్సార్సీపీకి బదిలీ అయిన ఓటు బ్యాంక్ మరల కాంగ్రెస్ పార్టీకి తిరిగి రావాలంటే అది కనుచూపుమేరలో సాధ్యం కాదు...
షర్మిల ఆంధ్రప్రదేశ్లో చేసిన ప్రసంగాలలో జగన్మోహన్ రెడ్డి మీదే ఎక్కువ దృష్టి కేంద్రీకరించి తెలుగుదేశం వ్యూహంలో భాగంగా ఆయన ను పలుచన చేసే కార్యక్రమం చేస్తుందని అభిప్రాయం బలంగా ఉంది...
తెలంగాణలో ఆమె వ్యవహరించిన తీరు తెన్నులు.. ఇక చేసేదేమీ లేక తెలంగాణ వైయస్సార్పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నాను అని ఆమె ప్రకటించడం స్పష్టంగా తెలుగు ప్రజలు గమనిస్తూనే ఉన్నారు...
మరి షర్మిల తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలు తమ అవసరాల కోసం పన్నిన వ్యూహంలో ఎలాంటి రాజకీయ ప్రయోజనం పొందుతుందో లేదా ఆటలో అరటిపండు అవుతుందో కాలమే నిర్ణయించాలి...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024
Comments 0