కుప్పంలో చంద్రబాబు ఓటమి..మంగళగిరిలో నారా లోకేష్ విజయం తథ్యం.. 135 సీట్లతో వైసిపి విజయకేతనం.. ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ సంచలనాత్మక సర్వే
కుప్పంలో చంద్రబాబు ఓటమి..మంగళగిరిలో నారా లోకేష్ విజయం తథ్యం.. 135 సీట్లతో వైసిపి విజయకేతనం.. ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ సంచలనాత్మక సర్వే
ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ ఎన్నికలకు ముందు తన తుది నాల్గవ సర్వే విడుదల చేసింది..
దీంట్లో సంచలనాత్మక అంశాలను వెల్లడి చేసింది.. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు ఓటమి.. మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ విజయం తథ్యం అని వెల్లడించింది..
ఇక 135 అసెంబ్లీ స్థానాలలో 22 ఎంపీ స్థానాలు వైసీపీ కైవసం చేసుకుంటుందని...40 అసెంబ్లీ... మూడు పార్లమెంట్ స్థానాలకే టిడిపి పరిమితం అవుతుందని వెల్లడించింది..
52.6% తో వైసిపి...43.1% ఓట్ల షేర్ తో టిడిపి కూటమి నిలుస్తాయి..
రాష్ట్రవ్యాప్తంగా గత సంవత్సర కాలంలో ఏడు లక్షల మంది ఓటర్లను సర్వే చేసినట్లు తెలిపింది..
సిద్ధం సభలు..బస్సు యాత్ర పేరుతో వైఎస్సార్సీపీ కార్యకర్తలతో జగన్మోహన్ రెడ్డి మమేకం కావడం... టిడిపి కూటమి వైఫల్యాలు..టిడిపి కూటమికంటే మెరుగ్గా వైయస్సార్సీపి ఎన్నికల ప్రచారం కొనసాగించడం... వైసిపి గ్రాఫ్ పెరగడానికి కారణాలు అని విశ్లేషించింది..
ఇక కూటమి లో బిజెపితో టిడిపి పొత్తు కారణంగా టిడిపి గ్రాఫ్ కాస్త తగ్గింది..
కూటమి తరపు అభ్యర్థుల ఎంపిక జనసేనకు పొత్తులో దక్కిన సీట్లు.,ఆ సీట్లలో కూడా టిడిపి నుండి వచ్చి జనసేన తీర్థం పుచ్చుకున్న వ్యక్తులకు టికెట్లు ఇవ్వడం జనసేన క్యాడర్ కూడా తీవ్ర నిరుత్సాహానికి గురి అయింది..
ననవరత్నాల లబ్ధిదారులలో 60 శాతం మంది ఓటర్లు వైసీపీ వైపు 34 శాతం మంది ఓటర్లు టిడిపి వైపు మొగ్గు చూపుతున్నట్లు సర్వే వెల్లడించింది... సామాజిక పింఛన్లు అందుకునే లబ్ధిదారుల్లో 75% మంది వైఎస్సార్సీపీకి..25 శాతం మంది టీడీపీకి మద్దతుగా ఉన్నట్లు వెల్లడించింది..
ఇక మహిళా ఓటర్లలో 65 శాతం మంది వైసీపీకి 35 శాతం మంది టీడీపీకి అనుకూలంగా ఉన్నట్లు వెల్లడించింది..
ఇక ఉద్యోగ వర్గాలు.. పురుష ఓటర్లలో ఓటింగ్ షేర్ టిడిపికి కొంతమేర అధికంగా ఉన్నట్లు వెల్లడించింది..
పార్లమెంటు స్థానాలలో అనకాపల్లి.. విశాఖపట్నం.. నర్సాపూర్ తెలుగుదేశం కైవసం చేసుకుంటుందని.. మిగిలిన 22 స్థానాలు వైసీపీ కైవసం చేసుకుంటుందని వెల్లడించింది..
ఇక సామాన్యులు వైసీపీ అభ్యర్థులు మైలవరం తిరుపతిరావు యాదవ్ జొన్నలగడ్డ వీరాంజనేయులు లక్కప్ప తదితరులు విజయం సాధిస్తారని వెల్లడించింది..
పర్చూరు నియోజకవర్గంలో వైసిపి అభ్యర్థి ఎడం బాలాజీ గెలుపు ఖాయమని ఈసారి ఏలూరి సాంబశివరావు కి పరాజయం తప్పదని వెల్లడించింది..
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024
Comments 0