బిజెపి జనసేన టిడిపి కూటమి మధ్య సయోధ్య కుదిరినట్లే
బిజెపి జనసేన టిడిపి కూటమి మధ్య సయోధ్య కుదిరినట్లే
అమిత్ షా నడ్డాలతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ చర్చలు దాదాపుగా ఫలప్రదం అయినట్లే...
పొత్తులో భాగంగా బిజెపికి ఐదు ఎంపీ సీట్లు... 10 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చేందుకు దాదాపుగా నిర్ణయం జరిగినట్లు సమాచారం ..
బిజెపి 10 ఎంపీ సీట్లను ఆశించగా చివరికి 5 లేదా 6 ఎంపీ స్థానాలు ఇచ్చేందుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రతిపాదించినట్లు అలాగే ఎమ్మెల్యే స్థానాలలో పది నియోజకవర్గాలు కేటాయించనున్నట్ల సమాచారం...
ఈ నెల 9న ఈ మేరకు ఈ విషయమై అధికారిక ప్రకటన కూటమి వెలువరించనుంది...
అరకు, రాజమండ్రి, నర్సాపురం, తిరుపతి, రాజంపేట లేదా హిందూపురం ఎంపీ స్థానాలు బీజేపీ కి ఇచ్చే ఆలోచన తెలుగుదేశం అధిష్టానం చేస్తున్నట్లు సమాచారం...
గుంటూరు వెస్ట్, విశాఖ నార్త్, జమ్మలమడుగు, కైకలూరు, కందుకూరు, ధర్మవరం, కాళహస్తితో పాటు తిరుపతి, గోదావరి, అనంతపురం జిల్లాల్లో ఒకొక్కటి ఎమ్మెల్యే సీట్లను ఖరారు చేసే అవకాశం ఉంది
రెండు రోజుల్లో ఈ విషయమై పూర్తి స్పష్టత రానుంది... ఇక ఇప్పటికే జనసేనకు మూడు ఎంపీ స్థానాలు 24 అసెంబ్లీ స్థానాలు పొత్తు లో భాగంగా కేటాయించారు..
140 అసెంబ్లీ స్థానాలలో 17 ఎంపీ స్థానాలలో తెలుగుదేశం పోటీ చేయనుంది...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024
Comments 0