కూటమి మేనిఫెస్టోలో మోడీ ఫోటో మిస్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఫోటోలకే పరిమితం
కూటమి మేనిఫెస్టోలో మోడీ ఫోటో మిస్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఫోటోలకే పరిమితం
కూటమి మేనిఫెస్టోని కూటమి అధినేతలు విడుదల చేశారు..
అయితే మేనిఫెస్టో విడుదల సందర్భంగా ట్విస్ట్ నెలకొంది...
మేనిఫెస్టో ముఖచిత్రంపై చంద్రబాబు పవన్ ఫోటోలు ముద్రించి ఉన్నాయి కానీ ప్రధాని మోడీ ఫోటో లేదు..
మేనిఫెస్టో విడుదల సందర్భంగా ఆ ప్రతిని పట్టుకొని విలేకరుల ముందు ప్రదర్శించేందుకు బిజెపి నేత రాష్ట్ర ఇంచార్జ్ సిద్ధార్థ నాథ్ సింగ్ అంగీకరించలేదు..
అయితే కూటమిలోని అందరిని అధినేతల ఫోటోలు లేకుండా కేవలం చంద్రబాబు పవన్ కళ్యాణ్ లా ఫోటోలు ముద్రించడం పట్ల ఒకంత విస్మయం వ్యక్తం అవుతుంది..
అవసరాల రీత్యా బీజేపీతో పొత్తు పెట్టుకున్నామే కానీ మోడీ ఫోటోను ప్రచురించవలసిన అవసరం తమకు లేదనే భావాన్ని చంద్రబాబు చెప్పకనే చెప్పినట్లు ఉందనే విమర్శలు బిజెపి నాయకులు నుండి వస్తున్నాయి...
ఇక మేనిఫెస్టోలోని ముఖ్యంశాలు:-
మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం..
దీపం పథకం కింద ప్రతి ఇంటికి ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితం..
ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు అందజేత...
నిరుద్యోగ యువతకు నెలకు రూ. 3 వేల చొప్పున భృతి..
యువతకు ఏటా 4 లక్షల చొప్పున ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు...
ప్రతి ఇంటికీ ఉచిత కుళాయి కనెక్షన్. స్వచ్ఛమైన తాగునీటి సరఫరా...
తల్లికి వందనం కింద చదువుకుంటున్న పిల్లలకు ఒక్కొక్కరికి ఏడాదికి రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం...
రైతులకు ఏడాదికి రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం..
ఆక్వారైతులకు రూ.1.50కే యూనిట్ విద్యుత్..
ప్రతి పేద కుటుంబానికి రెండు సెంట్ల ఇంటి స్థలం.. నాణ్యమైన సామగ్రితో మంచి ఇంటి నిర్మాణం.
ఇసుక ఉచితం..
భూ హక్కు చట్టం రద్దు..
సముద్ర వేట విరామ సమయంలో మత్స్యాకారులకు రూ.20వేల సాయం..
ఇసుక ఉచితం..
భూ హక్కు చట్టం రద్దు..
సముద్ర వేట విరామ సమయంలో మత్స్యాకారులకు రూ.20వేల సాయం..
బోట్ల మరమ్మతులకు ఆర్థిక సాయం..
చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలు...
బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024
Comments 0