తెలుగుదేశం స్క్రిప్టును యధాతధంగా చదివిన వైఎస్ సునీత
తెలుగుదేశం స్క్రిప్టును యధాతధంగా చదివిన వైఎస్ సునీత
ఢిల్లీలో విలేకరుల సమావేశం పేరుతో యధాతధంగా తెలుగుదేశం స్క్రిప్టును వైయస్ సునీత చదివారు...
వైయస్ వివేక మర్డర్ నుంచి జరిగిన సంఘటనలు తెలుపుతూ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి జగన్ సిబిఐ దర్యాప్తును వద్దనుకోవడం ఏమిటని ప్రశ్నించారు..
సిబిఐ అధికారులు వివేకానంద రెడ్డి హత్య కేసులో విచారణకు ఎంపీ అవినాష్ రెడ్డి సహకరించడం లేదు అనే విషయం స్పష్టం చేస్తున్నారు అని అన్నారు..
విశ్వసనీయత అంటారు.. మాట తప్పను...మడమ తిప్పను అంటారు...నా చెల్లి.. నా అక్క అంటారు... మరి ఈ చెల్లికి జరిగిన అన్యాయానికి న్యాయం చేయలేదే అని సునీత ప్రశ్నించారు...
దుష్ట చతుష్టయం అంటారు అంటూనే సరే అది పొలిటికల్ గా వాడే భాషగా వచ్చు మరి మా నాన్నని చంపిన దుష్టులను తేల్చే పని సీఎం జగన్ కి లేదా అని చెప్పుకొచ్చారు...
వివేక మర్డర్ విషయంలో చంద్రబాబు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ రఘురామకృష్ణం రాజు మరి అనేక రాజకీయ ప్రముఖులు మద్దతు ఇస్తున్నారని తెలిపారు...
రెండు విషయాలు చెప్పేందుకు నేను మీడియా ముందుకు వచ్చాను అంటూ.. వివేక హత్య కేసులో మీడియా మద్దతు నాకు కావాలి... అదేవిధంగా ప్రజాక్షేత్రంలో ప్రజా మద్దతు కావాలి అంటూ ముగించడం వెనుక ఆమె కూడా ఎన్నికల బరిలో కడప పార్లమెంట్ కి నిల్చోనుందా అనే అనుమానాలు వస్తున్నాయి..
అయితే వివేక మర్డర్ జరిగిన తర్వాత ఆయన వ్యక్తిత్వ హననం చేసిన ఒక ప్రముఖ టిడిపి దినపత్రికలోని అంశాలను..తరువాత ఆ అంశాలనే వైసిపి ఎంపీ అవినాష్ రెడ్డి కూడా ప్రస్తావిస్తూ ఆ కోణంలో దర్యాప్తు చేయాలని కోరారు..
కానీ అవి అబద్ధాలు అనే విషయాన్ని కూడా ఆమె మీడియా ముందు చెప్పలేకపోయింది...
వివేక మర్డర్ కేస్ సాక్షిగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓటు వేయమని కోరింది...
ఇక వైసిపి ఏ విధంగా కౌంటర్ సునీతకి ఇస్తుందనేది చూడాలి...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024
Comments 0